ఐపీఎల్ లోనూ ఈరోజు రాత్రి ఒక టఫ్ ఫైట్ చూడబోతున్నారు. ఈ సీజన్లోనే అతిపెద్ద హోరాహోరీ పోరు జరుగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మూడుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈ సాయంత్రం ఢిల్లీ వేదికగా తలపడనుంది. వరుసగా ఐదు విజయాలు సాధించిన చెన్నై తుఫాన్ ధాటికి మూడు మ్యాచ్ లు ఓడిన ముంబై ఇండియన్స్ తట్టుకొని నిలబడుతుందా? లేదా అన్నది వేచిచూడాల్సి ఉంటుంది.
-ముంబైకి మిడిల్ ఆర్డర్ సమస్య
ముంబై తన మొదటి ఐదు మ్యాచ్‌లను చెపాక్ స్టేడియంలో ఆడింది. చేపాక్ లోని క్లిష్టమైన్ స్పిన్ పిచ్ కారణంగా ఓడిపోయింది. ముంబై బ్యాట్స్ మెన్ పరుగులు చేయటానికి చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా క్వింటన్ డి కాక్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి వారు అక్కడ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. కానీ ఢిల్లీకి వెళ్ళిన తరువాత అక్కడి ఫ్లాట్ వికెట్ ముంబైకి కలిసివచ్చింది. డికాక్, కృనాల్ ఇద్దరూ తమ ఫామ్‌ను అందిపుచ్చుకున్నారు. గత మ్యాచ్ లో జట్టును సమష్టిగా రాణించి గెలిపించారు. ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఈ రాత్రికి జరిగే బలమైన చెన్నైను తట్టుకొని నిలబడుతారా? లేదా అన్నది మనం వేచిచూడాలి. ప్రతి బౌలర్ జట్టుకు బాగా రాణిస్తున్నందున బౌలింగ్‌లో అసలు సమస్యలు లేవు.
– చెన్నై వరుసగా ఆరో గెలుపు అందుకుంటుందా?
గత సంవత్సరం అట్టర్ ఫ్లాప్ అయిన చెన్నై ఈసారి మాత్రం ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తే టాప్ లో నిలిచింది. చాలా ఏళ్లలో మొదటిసారి సిఎస్‌కె వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలని వారు ఎదురుచూస్తున్నారు. ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. సీఎస్కే బౌలర్లు ముంబై బ్యాట్స్ మెన్లను తక్కువ స్కోరుకు పరిమితం చేయగలిగితే ఈ మ్యాచ్ లో సులభంగా గెలవవచ్చు.
ఐపీఎల్ చరిత్ర: ఈ రెండు టీంలు ఒకరితో ఒకరు ఆడిన 30 మ్యాచ్‌లలో ముంబై 18, చెన్నై 12 మాత్రమే గెలిచారు.
మ్యాచ్ వేదిక: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ.
మ్యాచ్ సమయం: సాయంత్రం 07.30 PM