జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం హాస్పిటల్ లోని సీటీ స్కాన్ రూమ్ లో మంటలు చెలరేగాయి. దీంతో సీటీ స్కాన్ యంత్రం, కంప్యూటర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. దవాఖానలో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు.