ఐపీఎల్ కు గ్రహణం: చెన్నైకు మరో షాక్.. హర్భజన్ ఔట్

ఈ ఐపీఎల్ ను కరోనా వదలడం లేదు. ఓవైపు దిగ్గజ ఆటగాళ్లు వైదొలుగుతున్నారు. వ్యక్తిగత కారణంతో దూరం ఉంటున్నారు. దీంతో ఈసారి ఐపీఎల్ ఆట సాగడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. Also Read: సుశాంత్ కేసులో కీలక పరిణామం..అదుపులో రియా సోదరుడు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి.  ఐపీఎల్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ […]

Written By: NARESH, Updated On : September 4, 2020 5:21 pm
Follow us on

ఈ ఐపీఎల్ ను కరోనా వదలడం లేదు. ఓవైపు దిగ్గజ ఆటగాళ్లు వైదొలుగుతున్నారు. వ్యక్తిగత కారణంతో దూరం ఉంటున్నారు. దీంతో ఈసారి ఐపీఎల్ ఆట సాగడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

Also Read: సుశాంత్ కేసులో కీలక పరిణామం..అదుపులో రియా సోదరుడు

ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి.  ఐపీఎల్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి రైనా తప్పుకున్నట్లు  ప్రకటించాడు.

సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. ఆగస్టు 21న యూఏఈకి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉంది. ఆ క్వారంటైన్ గడువు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా.. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్‌ దీపక్ చాహర్‌తో పాటు 10 మంది టీమ్ స్టాఫ్‌కి కరోనా పాజిటివ్‌గా శుక్రవారం తేలింది.

Also Read: చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?

తాజాగా ఇదే చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ సురేష్ రైనా ఇప్పటికే వైదొలగగా.. తాజాగా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించాడు.  తన నిర్ణయాన్ని జట్టు యాజమాన్యానికి తెలియజేశాడు.