కరోనా: ‘ప్రైవేట్’ దోపిడీపై జగన్ ఉక్కుపాదం

కరోనా మహమ్మారి పేరుతో ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు కాసులు దండుకుంటున్నాయి. రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. తెలంగాణలో అయితే మరీ దారుణంగా పరిస్థితి ఉంది. తాజాగా ఓ గర్భిణి డెలివరీ కోసం వస్తే ఆమెకు కరోనా ఉందని ఏకంగా చికిత్స పేరుతో కాలయాపన చేసి 29 లక్షలు కట్టించుకొని శవాన్ని కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారు.  ఇక ఏపీలోనూ ఇదే తంతు.. విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో 12మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. తాజాగా ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై ఫిర్యాదుల  నేపథ్యంలోనే […]

Written By: NARESH, Updated On : September 4, 2020 5:23 pm

Jagan Sarkar launches new scheme .. Farmers happy?

Follow us on


కరోనా మహమ్మారి పేరుతో ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు కాసులు దండుకుంటున్నాయి. రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నాయి. తెలంగాణలో అయితే మరీ దారుణంగా పరిస్థితి ఉంది. తాజాగా ఓ గర్భిణి డెలివరీ కోసం వస్తే ఆమెకు కరోనా ఉందని ఏకంగా చికిత్స పేరుతో కాలయాపన చేసి 29 లక్షలు కట్టించుకొని శవాన్ని కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారు.  ఇక ఏపీలోనూ ఇదే తంతు.. విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో 12మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. తాజాగా ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై ఫిర్యాదుల  నేపథ్యంలోనే జగన్ సర్కార్ సీరియస్ అయ్యింది. ఏపీలోనూ ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై  కఠిన నిర్ణయం తీసుకుంది.

Also Read: జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?

కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా టెస్టులు నిర్వహించిన మరో 9 సెంటర్ల లైసెన్స్ లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రైవేట్ సెంటర్ల నిర్వహణలో రూ. లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కొరఢా ఝలిపించింది..  విజయవాడలోని 22 ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్ ను రద్దు చేసింది.

ఇక నాలుగు రోజుల క్రితం డీఎంహెచ్.వో డా. రమేశ్ రిటైర్ అయ్యారు. ఆయన అనుమతులు ఇచ్చిన 13 సెంటర్ల లైసెన్స్ లను ఆయనే రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే దీనివెనుక కథేంటి అన్న దానిపై కూడా ప్రభుత్వం విచారణ జరుపుతోంది.

Also Read: జగన్ ధరించే మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా?

కరోనాతో కాసులు కురిపించుకుంటున్న ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఏపీలో మొదలైన ఈ తంతును తెలంగాణలోనూ కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో కరోనా చికిత్సల పేరిట ముఖ్యంగా హైదరాబాద్ లో దోపిడీ ఎక్కువగా ఉంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.