Homeక్రీడలుక్రికెట్‌Jio Data Pack Changes: ఐపీఎల్ వ్యసనమైన తర్వాత.. ముకేష్ జియో చెప్పినట్టు యూజర్లు వినాల్సిందే

Jio Data Pack Changes: ఐపీఎల్ వ్యసనమైన తర్వాత.. ముకేష్ జియో చెప్పినట్టు యూజర్లు వినాల్సిందే

Jio Data Pack Changes: ఒక అలవాట వ్యసమైన తర్వాత మానుకోవడం చాలా కష్టం. దాన్నుంచి బయటపడటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం ఉండదు. అందవల్లే దేనిని వ్యసనం మార్చుకోకూడదని మన పెద్దలు చెబుతుంటారు. మనదేశంలో చాలా మందికి క్రికెట్ అటే చాలా ఇష్టం. కొంతమందికి అది ఒకరకమైన వ్యవసనం. అందుకే మ్యాచ్ లు వస్తుంటే చాలు టీవీలకు, ఫోన్ లకు అతుక్కుపోతారు. ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి క్రికెట్ మ్యాచ్ లను నేరుగా […]

Jio Data Pack Changes: ఒక అలవాట వ్యసమైన తర్వాత మానుకోవడం చాలా కష్టం. దాన్నుంచి బయటపడటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం ఉండదు. అందవల్లే దేనిని వ్యసనం మార్చుకోకూడదని మన పెద్దలు చెబుతుంటారు. మనదేశంలో చాలా మందికి క్రికెట్ అటే చాలా ఇష్టం. కొంతమందికి అది ఒకరకమైన వ్యవసనం. అందుకే మ్యాచ్ లు వస్తుంటే చాలు టీవీలకు, ఫోన్ లకు అతుక్కుపోతారు.

ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి క్రికెట్ మ్యాచ్ లను నేరుగా ఫోన్ లోనే లైవ్ లో చూసేస్తున్నాం. నచ్చిన ఆటగాడి ఆట తీరును మరీమరీ చూస్తున్నాం. క్రికెట్ లో మూడు ఫార్మాట్లు ఉంటాయి. అందులో టీ20 అనేది చాలా మందికి ఇష్టం. అందులో ఉండే వేగం, ఉత్సాహం చాలామందికి ఇష్టం. అందుకే విపరీతంగా చూస్తుంటారు.
ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతోంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్ట్ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది. గతంలో ఐపీఎల్ ను జియో సినిమా టెలికాస్ట్ చేసేది. హాట్ స్టార్ తో జత కట్టిన తర్వాత జియో హాట్ స్టార్ గా మారిపోయింది.

ప్రస్తుత ఐపీఎల్ ను జియో హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. తన వినియోగదారులకు గతంలో జియో ఉచితంగా చూసే అవకాశం కల్పించేది. ఇప్పుడు మాత్రం షరతులు వర్తిస్తాయని జియో చెబుతోంది. మెగాటోర్నీవేళ రిలయన్స్ జియో 195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో యూజర్లకు షాక్ ఇచ్చింది. గతంలో 90 రోజులపాటు ఈ ప్యాక్ వ్యాలిడిటీలో ఉండేది. ఇప్పుడు దానిని 30 రోజులకు రిలయన్స్ తగ్గించింది.

ఈ ప్యాక్ లో 15జీబీ డేటా, జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్రయోజనాలు యథావిధిగా లభిస్తాయని జియో చెప్పింది. వ్యాలిడిటీ తగ్గడం వల్ల తక్కువ రోజుల్లోనే ఎక్కువ డాటా వాడాల్సి ఉంటుంది. తక్కువ రోజుల్లో అంత డేటాను ఎలా వాడతామని కొందమంది యూజర్లు చెబుతున్నారు. ముందుగా డాటా వాడటాన్ని అలవాటు చేసి, ఇప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నారని యూజర్లు ఆరోపిస్తున్నారు. మొదట్లో యూజర్లను దేవుళ్లుగా పేర్కొన్నారని, ఇప్పుడేమో షరతులు పెట్టి చుక్కలు చూపిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper