Homeక్రీడలుక్రికెట్‌IPL 2026: RCB, SRH అమ్మకంతో బీసీసీఐ కీ జాక్ పాట్

IPL 2026: RCB, SRH అమ్మకంతో బీసీసీఐ కీ జాక్ పాట్

IPL 2026: ఈసారి ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది విజేతగా నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి చేతులుమారింది. బిర్లా ఆధ్వర్యంలోని కన్సార్షియం బెంగళూరు జట్టును ఏకంగా 16000 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా ఇదేస్థాయిలో ధర లభించింది. దీంతో ఈసారి ఐపీఎల్ లో బెంగళూరు, రాజస్థాన్ జట్లు కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో పోటీలోకి దిగుతున్నాయి. రాజస్థాన్ జట్టును అమెరికాకు చెందిన కమాల్ సోమానీ కొనుగోలు చేశారు.

బెంగళూరు జట్టును 1.78 బిలయన్ డాలర్లు, రాజస్థాన్ రాయల్స్ ను 1.63 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాల పై బీసీసీఐకి కూడా భారీగానే రాబడి లభించింది. ఈ రెండు జట్ల మొత్తం విలువ సుమారు 31,000 కోట్లు. ఈ రెండు ఒప్పందాలపై ఐదు శాతం బదిలీ రుసుము కారణంగా ఈ అమ్మకాల ద్వారా బీసీసీఐ రూ,1,550 కోట్ల నుంచి 1,583 కోట్ల వరకు ఆర్జించనుంది.

రాజస్థాన్ గురించి కచ్చితమైన సమాచారం తెలియడంలేదు. ఎందుకంటే పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ కూడా భాగస్వాములుగా చేరవచ్చని తెలుస్తోంది. గతంతో రాజస్థాన్ రాయల్స్ బ్రిటిష్ , భారతీయ వ్యాపారవేత్త మనోజ్ బదాలే ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ ఇండియా వెంచర్స్ యాజమాన్యం ఆధీనంలో ఉండేది.

బెంగళూరు లో వందశాతం వాటాను కొనుగోలుచేయడానికి ఏకంగా నాలుగు దిగ్గజ కార్పొరేట్ సంస్థలు జత కలిశాయి. ఐతే ఐపీఎల్ ఏ జట్టయినా చేతులు మారినా.. కొనుగోలు వంటివి జరిగినా నిబంధనలప్రకారం ఐదుశాతం వాటా అనేది బీసీసీఐకి వెళ్తుంది. గతంలో దక్కన్ చార్జర్స్ జట్టు కావ్యమారన చేతుల్లోకి వెళ్లినప్పుడు బీసీసీఐకి ఇలాగే ఐదుశాతం వాటా లభించింది. ఓ అంచనా ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ విలువ లక్ష కోట్లకు పైగా ఉంటుందట. ఇందులో లాభాలు కూడా భారీగా ఉండటంతో పెద్ద పెద్ద కార్పొరేటర్లు ఇందులోకి వస్తున్నారు

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular