IPL 2025 : చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు లాస్ అయ్యి 182 రన్స్ స్కోర్ చేసింది. నితీష్ రాణా(81), రియాన్ పరాగ్ (37) టాప్ స్కోరర్లు గా నిలిచారు. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చెన్నై జట్టులో రుతు రాజ్ గైక్వాడ్(63), రవీంద్ర జడేజా (32), రాహుల్ త్రిపాటి (23) ఆకట్టుకున్నారు. రచిన్ రవీంద్ర (0), విజయ్ శంకర్ (9) విఫలమయ్యారు. ఎంఎస్ ధోని(16) చివర్లో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టి అలరించాడు. ఈ దశలో సందీప్ శర్మ బౌలింగ్లో హిట్ మేయర్ పట్టిన క్యాచ్ కు ధోని అవుట్ అయ్యాడు. ధోని అవుట్ కావడంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా ఓ ఓ యువతి ఆర్య ప్రియ క్యూట్ రియాక్షన్ ఇచ్చింది. అది కాస్త సోషల్ మీడియాలో పడి వైరల్ అయింది. ఆ యువతీ ఇచ్చిన క్యూట్ రియాక్షన్ వీడియోను పదే పదే ప్లే చేయడంతో ఒక్కసారి ఆమె సెలబ్రిటీ అయిపోయింది.
Also Read : ఫస్ట్ అన్ క్వాప్డ్ కెప్టెన్ ధోని.. ఇంకా ఎన్నో ఘనతలు
జాతకం మారిపోయింది
ధోని అవుట్ అయిన తర్వాత క్యూట్ రియాక్షన్ ఇచ్చిన ఆ యువతి పేరు ఆర్య ప్రియ భుయాన్(Aarya Priya bhuyan) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా లో ఆమెను 800 మంది అనుసరిస్తున్నారు. అయితే ధోని అవుట్ కావడం వల్ల ఇచ్చిన రియాక్షన్ తో ఒక్కసారిగా ఆమె సెలబ్రిటీ అయిపోయింది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమెను అనుసరించే వారి సంఖ్య 3.98 లక్షలకు పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆమె స్విగ్గి ఇన్ స్టా మార్ట్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.. ఇక ఇప్పటికే YES మేడం అనే కంపెనీ నుంచి ఫ్రీ కొరియన్ క్లీనప్ మెటీరియల్ ఆమె ఇంటికి వచ్చి చేరింది. ఇవే కాకుండా ఇంకా మరిన్ని ఆఫర్లు ఆమె తలుపు తట్టాయని తెలుస్తోంది. మొన్నటిదాకా ఆమె ఎవరో ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇప్పుడు మాత్రం సెలబ్రిటీ అయిపోయింది. పెద్దపెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు అందుకుంటున్నది. చూడాలి ఆమె ఎదుగుదల ఏ విధంగా ఉంటుందనేది. ఇటీవల సోషల్ మీడియా వల్ల మోనాలిసా సెలబ్రెటీ అయిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆమెకు సినిమా అవకాశం కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఆర్య ప్రియ జాతకం ఎలా మారుతుందో చూడాలి..
View this post on Instagram