IPL Mega Auction 2025: ఐపీఎల్ 2025కు అడుగు పడింది. సీజన్ 19కు ఫ్రాంచైజీలు వేలం ద్వారా శ్రీకారం చుట్టాయి. ఇప్పటి వరకు చాంపియన్ కాని ఆర్‌సీబీ నుంచి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండయిన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల వరకు వేలంలో ఆచితూచి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. బలం అనుకున్న వారికి కోట్లు కుమ్మరించాయి. అవసరం లేనివారిని వదిలేసుకున్నాయి. రెండు రోజులు(నవంబర్ 24, 25) నిర్వహించిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స జట్టు మరింత బలంగా తయారైంది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పోటీలో వెనుకబడింది. ఈసారి అలా జరగకుండా మేనేజ్‌మెంట్ ఆచితూచి అడుగులు వేసింది. కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంతో 2025 సిరీస్‌సు సమతుల క్రీడాకారులతో సిద్ధం కానుంది. వేలంలో ఫ్యాన్సీ ఆటగాళ్ల జోలికి వెళ్లకుండా దుమ్ము రేపింది. తమకు కావాల్సిన ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. సెలక్షన్స్‌లో టీమిండియా మాజీ సారథి, ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ మార్కు కనిపించింది.
అనుభవానికి పెద్దపీట..
చెన్నై జట్టు మేనేజ్‌మెంట్ వేలంలో అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చింది. సీనియర్ ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. జట్టు భవిష్యత్ కోసం అనామక ఆటగాళ్లకు కూడా కోట్లు వెచ్చించింది. తెలుగు తేజం షేక్ రషీద్‌తోపాటు అనేక మంది కుర్రాళ్లను కొనుగోలు చేసింది.
పలువురికి రిటైన్..
వేలానికి ముందే తమ ప్రధాన ఆటగాళ్లను చెన్నై టీం మేనేజ్‌మెంట్ రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్, మతీష పతీరణ, శివమ్ దూబే, రవీంద్రజడేజా, మహేంద్రసింగ్ ధోనీలను అంటిపెట్టుకుంది. తమ పాత ఆటగాళ్లు అయిన డేవన్ కాన్వే, రచిన్ రవీంద్రలను తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను మళ్లీ కొనుగోలుచేసింది. ఆయనకు రూ.9.75 కోట్లు ఖర్చు పెట్టింది. మరో ఆఫ్గాన్ స్పిన్నర్ నూర్ అమ్మద్ కోసం రూ.10 కోట్లు వెచ్చించింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను తక్కువ ధరకు దక్కించుకుంది. భారత పేసర్లలో ఖలీల్ అమ్మద్, ముఖేష్ చౌదరీలను కొనుగోలు చేరసింది. బ్యాటర్లలో వెటరన్ ప్లేయర్ దీపక్ హుడాను కొనుగోలు చేసింది. వేలంలో మొత్తం 20 మంది క్రీడాకారులను కొనుగోలు చేసింది. 25 మందదితో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.
సీఎస్‌కే కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
డేవన్ కాన్వే(రూ.6.25 కోట్లు), రాహుల్ త్రిపాఠి(రూ.3.4 కోట్లు), రచిన్ రవీంద్ర(రూ.4 కోట్లు,), రవిచంద్రన్ అశ్విన్ రూ.(9.75 కోట్లు), ఖలీల్ అహ్మద్(రూ.4.80 కోట్లు), నూర్ అహ్మద్(రూ.10 కోట్లు), విజయ్ శంకర్ (రూ.1.2 కోట్లు), సామ్ కరణ్(రూ.2.4 కోట్లు), షేక్ రషీద్(రూ.30 లక్షలు) అన్షుల్ కంబోజ్(రూ.3.4 కోట్లు), ముఖేష్ చైదరి(రూ.30 లక్షలు), దీపక్ హుడా(రూ.1.7 కోట్లు,), గుర్జప్‌నీత్ సింగ్(రూ.2.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ.2 కోట్లు,), జామీ ఓవర్ణన్(రూ.1.5 కోట్లు,) కమలేశ్ నాగర్‌కోటి(రూ.30 లక్షలు,) రామకృష్ణ ఘోష్(రూ.30 లక్షలు), శ్రేయస్ గోపాలరూ.30 లక్షలు), వాన్షి బేడీ(రూ.55 లక్షలు), ఆండ్రే సిద్దార్థ్(రూ. 30 లక్షలు).
సీఎస్‌కే రిటైన్ చేసిన ఆటగాళ్లు..
రుతురాజ్ గైక్వాడ్(రూ.18 కోట్లు), మతీష పతీరణ(రూ.13 కోట్లు), శివమ్ దూబే(రూ.12 కోట్లు), రవీంద్ర జడేజా(రూ.18 కోట్లు), మహేంద్రసింగ్ ధోనీ(రూ.4 కోట్లు)
సీఎస్‌కే తుది జట్టు(అంచనా)..
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, మహేంద్రసింగ్ ధోనీ(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, సామ్ కరణ్, ఖలీల్ అహ్మద్, మతీష పతీరణ.