https://oktelugu.com/

Rajamouli : ఈ స్టార్ డైరెక్టర్లు రాజమౌళి ని చూసి ఆ ఒక్కటి నేర్చుకోవాల్సిందే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక దర్శకుల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని తయారు చేయడంలో దర్శకుడు కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు.

Written By: , Updated On : November 26, 2024 / 08:48 AM IST
These star directors have to watch Rajamouli and learn that one thing...

These star directors have to watch Rajamouli and learn that one thing...

Follow us on

Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక దర్శకుల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని తయారు చేయడంలో దర్శకుడు కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. అందువల్లే దర్శకుడు సినిమా మీద పెట్టే ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ చాలామంది స్టార్ హీరోలను తయారు చేశాడు. మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో స్టార్ గా ఎస్టాబ్లిష్ అవ్వడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గర్వంగా నిలబడేలా చేశాయి. నిజానికి బాహుబలి లాంటి సినిమాతో పాన్ ఇండియాలో తెలుగు సినిమా సత్తాని చాటిన ఈ స్టార్ డైరెక్టర్ తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఇకమీదట ఆయన చేయబోయే సినిమాల మీద కూడా భారీ అంచనాలైతే క్రియేట్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుతో కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తెలుగులో స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికి రాజమౌళి స్థాయిని మాత్రం ఎవరు అందుకోలేకపోతున్నారు.

కారణం ఏంటి అంటే రాజమౌళి ఒక సినిమా మీద పెట్టే డెడికేషన్ ఆయన చూపించే పర్ఫెక్షన్ ఇతర దర్శకులు వాళ్ళ సినిమాల మీద పెట్టడం లేదు అనేది చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. ఒక సినిమా కోసం వాళ్లు మహా అయితే ఒకటి రెండు సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు.

దాని తర్వాత వాళ్లకి ఆ సినిమా బోర్ కొట్టేస్తుంటుంది. కానీ రాజమౌళి మాత్రం అలా కాదు. ఒక సినిమా మీద కూర్చున్నాడు అంటే ఆ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేంతవరకు వేరే ప్రాజెక్టు ఏది పెట్టుకోడు. అందువల్లే ఆయన సినిమాల్లో పర్ఫెక్షన్ గాని ప్రజెంటేషన్ గాని అంతా ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. అందుకే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు రావడం లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు రాజమౌళిని చూసి పర్ఫెక్షన్ విషయంలో గాని ఒక సినిమా కోసం ఓపిగ్గా వర్క్ చేయడం ఎలా అనే విషయాల్లో ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఆయనను ఆదర్శంగా తీసుకుంటే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి…