https://oktelugu.com/

Game Changer : దర్శకులు కావాలనే రామ్ చరణ్ కి డిఫెక్ట్ పెడుతున్నారా..? రంగస్థలం లో అలా, గేమ్ చెంజర్ లో మరోలా, మరి ఆర్ సి 16 లో ఎలా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతుంది. డిఫరెంట్ కథలతో సినిమాలు చేయడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించే సినిమాలను సైతం చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 26, 2024 / 08:43 AM IST

    Are you giving a defect to Ram Charan who wants to become a director..? Like that in Rangasthalam, like that in Game Changer, and how about in RC 16..?

    Follow us on

    Game Changer : ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుండటంతో మరోసారి శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ టీజర్ ప్రేక్షకులను ఆకరించడమే కాకుండా సినిమా మీద భారీ హైప్ అయితే పెంచింది…

    మెగాస్టార్ తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని అలరించడమే కాకుండా హాలీవుడ్ దర్శక దిగ్గజమైన జేమ్స్ కామెరూన్ ను సైతం ఆకట్టుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు… ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నత్తి వాడిగా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు రంగస్థలం సినిమాలో చెవిటి పాత్రను పోషించిన ఆయన ఇప్పుడు నత్తి క్యారెక్టర్ ను చేస్తున్నాడు. నిజానికి ఇప్పుడున్న దర్శకులందరు రామ్ చరణ్ కి ఏదో ఒక డిఫెక్ట్ పెడితేనే వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు ఎలా ఉన్నా కూడా కొన్ని సెంటిమెంట్లను బ్లైండ్ గా ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో తో రంగస్థలం సినిమాలో చెవిటి వాడి పాత్రని పోషింప చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజానికి సుకుమార్ ఈ సినిమాతో ఒక రకంగా చాలా పెద్ద రిస్క్ చేశాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా అదే రిస్క్ చేస్తున్నాడా? ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం శంకర్ మీద భారీ విమర్శలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. లక్కీగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే అయితే మాత్రం శంకర్ స్థాయి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా మెగా ఫ్యాన్స్ గేమ్ చేజర్ సినిమా మీదనే ప్రస్తుతం భారీగా ఆశలైతే పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సంక్రాంతి మనదే అన్న రేంజ్ లో వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాంటి వైవిధ్యాన్ని చూపిస్తాడనేది తెలియాల్సి ఉంది.

    ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో శంకర్ ఈ సినిమాను రూపొందించాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఇదిలా ఉంటే రంగస్థలం సినిమాలో చెవిటి పాత్రలో నటించిన రామ్ చరణ్ ఈ సినిమాలో నత్తివాడిగా నటిస్తున్నాడు. ఇక బుచ్చిబాబు సినిమాలో ఇంకెల నటిస్తున్నాడు అంటూ కొంతమంది దర్శకుల మీద ఫన్నీ కామెంట్లైతే చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటాలంటే మాత్రం గేమ్ చేంజర్ సినిమా అనేది కీలక పాత్ర వహిస్తుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం జనవరి 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…