IPL 2025 RCBvPBKS Final : టాస్ ప్రక్రియలో పంజాబ్ సారధి అయ్యర్ విజయం సాధించాడు. మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ వైపు ఆసక్తి చూపించాడు. ఎందుకంటే ఈ పిచ్ పై గత మ్యాచ్లో అయ్యర్ సేన హార్దిక్ పాండ్యా జట్టుపై చేజింగ్ చేసి విజయం సాధించింది. బహుశా దానిని రిపీట్ చేయాలని అయ్యర్ భావించినట్టు తెలుస్తోంది.. టాస్ ప్రక్రియను రవి శాస్త్రి పర్యవేక్షించారు. ఆ తర్వాత ఇరుజట్ల సారధులతో రవి శాస్త్రి మాట్లాడారు. ఈ సందర్భంగా అయ్యర్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Also Read : మరికొద్ది క్షణాల్లో మ్యాచ్.. ఐసీసీ చైర్మన్ బెంగళూరు ఆటగాళ్ల హోటల్ కు ఎందుకు వెళ్ళినట్టు?
“ఒకరోజు క్రితం జరిగిన మ్యాచ్లో మీరు విజయం సాధించారు. సత్తాను చూపించారు. అయితే మీ చేతికి గాయం అయిందని తెలిసింది. మొన్నటికి, ఇవాల్టికి పరిస్థితి ఎలా ఉంది? మీ ఆరోగ్యం బాగుందా? గాయం వల్ల నొప్పి ఎదురవుతోందా” అని రవి శాస్త్రి ప్రశ్నించగా.. ” మొన్నటికి ఇవాల్టికి ఏమీ మారలేదు. మొన్న అయితే ఎలాంటి ఆట తీరు ప్రదర్శించామో.. ఈరోజు కూడా అలాంటి ఆట తీరును ప్రదర్శిస్తాం.. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక గాయం అంటారా.. లక్ష్యం మీద మనసు ఉంటే.. అది సూటిగా కనిపిస్తుంటే గాయం పెద్దగా ఇబ్బంది పెట్టదు.. మాకైతే టార్గెట్ క్లియర్ గా ఉంది. గాయం వల్ల.. ఇతర పరిస్థితుల వల్ల మాకు ఎటువంటి అవరోధం లేదని” అయ్యర్ వ్యాఖ్యానించాడు. పైగా అయ్యర్ మాట్లాడుతున్నప్పుడు ముఖంలో ఎటువంటి హావా భావాలు ప్రదర్శించలేదు. సీరియస్ లుక్ లోనే అయ్యర్ రవి శాస్త్రికి సమాధానం చెప్పాడు.
రజత్ ఏమన్నాడంటే..
“పిచ్ కష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మంచి స్కోర్ చేసి వారిని ఒత్తిడిలో అడగడానికి ప్రయత్నాలు చేస్తాం. ఈ సీజన్లో ఇప్పటివరకు మేము అద్భుతమైన క్రికెట్ ఆడాము. ఇది మాకు మరో మ్యాచ్. ఇది చివరి అంచె అయినప్పటికీ.. మాకు మరో ఆట మాత్రమే.. అదే జట్టు..ప్లాట్ ట్రాక్ అను నేను భావిస్తున్నాను.. ఇది ఎరుపు, నల్ల నేలల మిశ్రమంతో రూపొందించిన పిచ్.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని” పాటిదార్ రవి శాస్త్రి తో వ్యాఖ్యానించాడు.
తుది జట్ల అంచనా ఇలా..
బెంగళూరు: సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, పాటిదార్(కెప్టెన్), లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, రోమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హేజిల్ వుడ్.
పంజాబ్: అయ్యర్ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, నెహల్ వదేరా, శశాంక్ సింగ్, స్టోయినీస్, ఓమర్జాయ్, కైల్ జామీ సన్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్ దీప్ సింగ్, చాహల్, ఇంగ్లిస్.
Toss @PunjabKingsIPL won the toss and elected to bowl first against @RCBTweets in the Grand #Final
Updates ▶ https://t.co/U5zvVhbXnQ#TATAIPL | #RCBvPBKS | #TheLastMile pic.twitter.com/OG9rob7n0U
— IndianPremierLeague (@IPL) June 3, 2025