ICC Chairman visit Bengaluru hotel, : నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది అని భావిస్తున్న తరుణంలో.. ఐసీసీ చైర్మన్ జై షా అహ్మదాబాదులో కన్నడ జట్టు ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ వెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తున్నాయి. అయితే చివరి అంచె పోటీకి సంబంధించి అసలు వ్యవహారం పూర్తయిందని.. కన్నడ జట్టుకు ట్రోఫీని కట్టబెట్టడానికి తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని.. పంజాబ్ అభిమానులు ఆరోపిస్తున్నారు.. జై షా ను పరోక్షంగా కామెంట్లు చేస్తూ..”రచనా కారుడు” అంటూ వెటకారం చేస్తున్నారు.. ” అసలు ఆయన ఎందుకు వచ్చాడు. ఉన్నట్టుండి బెంగళూరు ప్లేయర్లు స్టే చేస్తున్న హోటల్ ఎందుకు వెళ్ళాడు? అసలు ఏం జరుగుతోంది.. ఇంత కష్టపడి అయ్యర్ సేన ఇక్కడ దాకా వస్తే.. తెర వెనుక ఈ ప్రయత్నాలు ఏంటని” పంజాబ్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు..
Also Read : ఐపీఎల్ ఫైనల్ వేదికపై నుంచి గర్జించిన వాయుసేన.. అదిరిపోయిన ఓపెనింగ్ సెర్మనీ
మరోవైపు ఈ సిరీస్లో ఇప్పటివరకు అయ్యర్ సేన అదరగొట్టింది. దుమ్ము రేపే ఆటతీరుతో ఆకట్టుకుంది. బలమైన హార్దిక్ సేనను ఓడించింది. క్వాలిఫైయర్ -2 లో సత్తా చూపించి ఏకంగా చివరి అంచె పోటీ దాకా వచ్చింది. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రీతి జింటా జట్టు ఫైనల్ దాకా వచ్చేసింది.. ఇక గత సీజన్లో షారుక్ ఖాన్ జట్టుకు ట్రోఫీని అయ్యర్ అందించాడు. ఏడాది తిరిగే వరకే తన జట్టును మారిపోయాడు. పంజాబ్ జట్టుకు అతడు సారధ్యం వహిస్తున్నాడు. ఆటగాడిగా మాత్రమే కాకుండా, నాయకుడిగా కూడా ప్రీతి జింటా జట్టును అన్ని విభాగాలలో ముందుండి నడిపిస్తున్నాడు. ఏకంగా ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. ఈ ట్రోఫీ కోసం కన్నడ జట్టు కూడా తీవ్రంగా పోరాటం చేస్తోంది. ఈ రెండు జట్లు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు. మొత్తంగా చూస్తే ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యవహారం లాగా మారిపోయింది. రెండు జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కప్ కోసం అటు పంజాబ్, ఇటు బెంగళూరు కళ్ళు కాయలుకాచే విధంగా ఎదురుచూస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ పిచ్ పై పంజాబ్ టాస్ గెలవడంతో.. ట్రోఫీ కూడా ఆ జట్టు గెలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇటీవల కాలంలో పది మ్యాచ్ లు జరిగితే.. అందులో కన్నడ జట్టు 6, పంజాబ్ జట్టు 4 గెలిచింది.
ఈ సీజన్లో జోరు మీద ఉన్న పంజాబ్ బ్యాటర్లను కన్నడ బౌలర్లు కట్టడి చేశారు. అద్భుతమైన లెంగ్త్ తో పంతులు వేసి అదరగొట్టారు.. పంజాబ్ జట్టు టాప్ ఆర్డర్ ను తీవ్రంగా దెబ్బ కొట్టారు.. కన్నడ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్లలో పంజాబ్ నాయకుడు కేవలం 15 పరుగులు మాత్రమే చేయడం విశేషం. అయితే చివరి పోటీలో పంజాబ్ కన్నడ జట్టు బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కుంటేనే గెలవడానికి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.. ఇక ఈ వేదికపై గత ఎనిమిది మ్యాచ్లలో 11 సార్లు 200 కి పైగా పరుగులు నమోదు అయ్యాయి. ఆరుసార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి.