IPL 2025 : ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్లతో మాట్లాడాడు. ఓటమిలో ఉన్న జట్టు ఆటగాళ్లను పరామర్శించడానికి వారి వైపుగా రాహుల్ ద్రావిడ్ కదిలాడు. రాహుల్ ద్రావిడ ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఊతకర్రల సహాయంతోనే అతడు ఆటగాళ్లను పరామర్శించడానికి వెళ్ళాడు. రాహుల్ ద్రావిడ్ వస్తున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ స్పందించాడు. “సార్ మీరు రావద్దు.. వాళ్ళే మీ దగ్గరికి వస్తారు.. అటువైపుగా మీరు వెళ్లకూడదని కోరాడు.. ఇప్పటికే మీ ఆరోగ్యం బాగోలేదు. మీరు ఇంకా ఇబ్బంది పడతారని” రాహుల్ ద్రావిడ్ ను విరాట్ కోహ్లీ కోరాడు.. విరాట్ కోహ్లీ చేసిన అభ్యర్థనను రాహుల్ ద్రావిడ్ సుత్తి మెత్తగా తిరస్కరించాడు..
Also Read : టి20 లలో “విరాట్”పర్వం.. ఆసియా నుంచి ఒకే ఒక్కడు..
రాహుల్ ద్రావిడ్ తో కరచాలనం
రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ ఆటగాళ్ల వద్దకు వెళ్లి.. వారితో మాట్లాడాడు. ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించాడు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ తో మాట్లాడాడు.. కెప్టెన్ సంజు శాంసన్ తో కూడా చర్చించాడు. ” ఓటమి అనేది తాత్కాలికం. తర్వాత మ్యాచ్లలో సత్తా చాటాలి. ఈ ఓటములను కాస్త లోతుగా విశ్లేషించి.. దానికి గల కారణాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత మరోసారి ఓటములు ఎదురుగా కాకుండా చూసుకోవాలని” రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ ఆటగాళ్లకు సూచించాడు. ఆ తర్వాత రాజస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేశాడు. దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి..” రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు చాలా అదృష్టవంతులు. ఇంతటి ఓర్పు, నేర్పు ఉన్న కోచ్ దొరకడం గొప్ప విషయం. ఆయన అద్భుతమైన వ్యక్తి. మైదానంలో.. మైదానం వెలుపల.. ఒకే విధంగా ఉంటారు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో తీవ్రంగా కృషి చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఓటమి పాలైన తర్వాత.. రాహుల్ ద్రావిడ్ జట్టు కోసం తీవ్రంగా శ్రమించారు. బ్యాటింగ్లో మరింత రాటు తేలే విధంగా ప్లేయర్లకు శిక్షణ ఇచ్చారు. అది టి20 వరల్డ్ కప్ లో కనిపించింది. ఫలితంగా ధోని తర్వాత మళ్లీ ఇప్పుడు రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా గెలిచింది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగిసిన తర్వాత.. మళ్లీ కోచ్ గా ఉండాలని రోహిత్ శర్మ ప్రతిపాదించాడు. కాని దానిని రాహుల్ ద్రావిడ్ తిరస్కరించాడు. రాహుల్ ద్రావిడ్ నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. తన వల్ల జట్టు ఏమాత్రం ఇబ్బంది పడకూడదని భావించి.. ఆయన ఊత కర్రల సహాయంతోనే మైదానంలోకి అడుగు పెట్టారు. ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : గ్రీన్ కలర్ జెర్సీ లో బెంగళూరుకు తిరుగులేదంతే.. ఎన్ని విజయాలు సాధించిందంటే..