IPL 2025 Prize Money : బెంగళూరు ఛాంపియన్ గా అవతరించిన నేపథ్యంలో.. మిగతా పురస్కారాలను కూడా ఐపీఎల్ నిర్వాహక కమిటీ అందజేసింది. కృణాల్ పాండ్యా పీవోటీఎం పురస్కారం దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా సూర్య కుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.. 759 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా గుజరాత్ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ నిలిచాడు. 25 వికెట్లు పడగొట్టి గుజరాత్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ విన్నర్ గా నిలిచాడు. పెయిర్ ప్లే అవార్డును చెన్నై జట్టు సొంతం చేసుకుంది. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా గుజరాత్ ఓపెనర్ సుదర్శన్ నిలిచాడు. ఉత్తమ ఫీల్డర్ గా కామిందు మెండిస్ నిలిచాడు. వీరందరికీ పది లక్షల చొప్పున ఐపీఎల్ నిర్వాహక కమిటీ నగదు బహుమతి అందజేసింది. నగదు పురస్కారంతోపాటు.. ట్రోఫీలు కూడా అందించింది.
విజేతగా నిలిచిన కన్నడ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీతో పాటు, 20 కోట్ల నగదు బహుమతి లభించింది. రన్నర్ అప్ అయ్యర్ జట్టుకు 12.5 కోట్లు లభించాయి. మూడో ప్లేస్ లో నిలిచిన ముంబై జట్టుకు ఏడు కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ జట్టు 6.5 కోట్ల నగదు లభించింది. ఆరెంజ్ క్యాప్ విన్నర్ కు 10 లక్షలు, పర్పుల్ క్యాప్ విన్నర్ కు 10 లక్షలు, మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ కు 10 లక్షలు, బెస్ట్ ఫీల్డర్ కు పది లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు 10 లక్షలు, పేయిర్ ప్లే టీం కు పది లక్షల చొప్పున నగదు బహుమతిని ఐపీఎల్ నిర్వాహక కమిటీ అందజేసింది. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లను గుజరాత్ జట్టు ఆటగాళ్లు సొంతం చేసుకోవడం విశేషం. ఐపీఎల్ ప్రైజ్ మనీ 20 కోట్లు మాత్రమే అయినప్పటికీ.. ప్రకటనలు, స్టేడియంలో టికెట్లు అమ్మకం, ఇతర వ్యవహారాల ద్వారా మేనేజ్మెంట్ లకు భారీగా ఆదాయం వస్తుంది కాబట్టి ఐపిఎల్ ఆడుతాయి. కోట్లకు కోట్లు పెట్టి ప్లేయర్లను కొనుగోలు చేసి.. ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ వినోదాన్ని అందిస్తాయి..
ఐపీఎల్ ద్వారా ఆదాయం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలోనే జట్లు కోట్లకు కోట్లు ఆటగాళ్ల మీద కుమ్మరిస్తున్నాయి. అందువల్లే ప్రపంచంలోనే అతిపెద్ద రిచ్ క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ అవతరించింది. ఒక నివేదిక ప్రకారం ఐపిఎల్ మార్కెట్ విలువ లక్ష కోట్లను దాటిపోయింది. వచ్చే సీజన్లో ఇది అంతకుమించి అనే రేంజ్ లో పెరిగిపోతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. కన్నడ, ప్రీతి జింటా జట్ల మధ్య జరిగిన చివరి అంచె మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో ఏకంగా 60 కోట్ల మంది చూశారంటే మన దేశంలో క్రికెట్ అంటే ఏ స్థాయిలో ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.