IPL 2025 Postponed: భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగడంతో గురువారం ధర్మశాల వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ ఆపివేసింది. ఈ మ్యాచ్‌ను రద్దు చేసి స్టేడియం నుంచి ప్రేక్షకులను తెలివిగా బయటకు పంపివేసింది. అయితే భారత్, పాక్ యుద్ధ వాతావరణ సమయంలో క్రికెటర్ల భద్రత దృష్ట్యా ఐపీఎల్‌ను కొన్ని రోజుల పాటు వాయిదా వేసింది. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ చెందారు. అయితే బీసీసీఐ ప్రకటనతో ఐపీఎల్‌పై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో బాగా ఆడుతాయని ఆశించిన జట్లు ముందుగానే నిష్ర్కమించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు ఆడుతాయని, తప్పకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుతాయని భావించారు. కానీ ఈ జట్లు ముందుగానే సీజన్ నుంచి నిష్క్రమించాయి. అన్నింటి కంటే ముఖ్యంగా సీఎస్కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పకుండా ప్లే ఆఫ్ రేస్‌లో ఉంటాయని అనుకున్నారు. కానీ ఈ జట్లు సీజన్ మొదటి నుంచి సరిగ్గా ఆడలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే 300 స్కోర్ కొడుతుందని అనుకున్న ప్రతీసారి ఈ సీజన్‌లో నిరాశపరిచింది.
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బాగా రాణించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌లో ఉంది. బెంగళూరు ఈ సీజన్‌లో మొదటి నుంచి ఆడి.. టాప్ 2 లో ఉంది. అయితే ఈ సారి కప్ కొడుతుందని అందరూ భావించినా కూడా చివరకు మ్యాచ్ వాయిదా పడింది. మళ్లీ ఈ మ్యాచ్‌లను త్వరలోనే నిర్వహిస్తారు. అయితే రాయల్స్ బెంగళూరు జట్టు గెలవడం ఆఖరికి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే టాప్ 2 ప్లేస్‌లో ఉండగా.. మ్యాచ్‌ను వాయిదా వేశారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ వాయిదా పడితే ఆర్సీబీ జట్టు బాధపడుతున్నట్లు.. సీఎస్కే, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ జట్లు సంతోష పడుతున్నట్లు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే పైకి బాధపడుతున్నట్లు నటిస్తున్నా కూడా మనస్సు లోపల మాత్రం నవ్వుతున్నట్లు, హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఒకటేంటి.. ఎన్నో మీమ్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
IPL 2025 SUSPENDED
நாட்டுக்காக- லா இல்ல…நீ கேட்ட அதான்…#IPL2025 #Csk #RCB pic.twitter.com/PSASXUzqoY— Cricket Memes Tamil (@CricketMemesTa1) May 9, 2025
ఇదిలా ఉండగా ఐపీఎల్ ఈ సీజన్‌లో టాప్‌లో గుజరాత్ టైటాన్స్ ఉండగా.. సెకండ్ ప్లేస్‌లో రాయల్ ఛాలెంజర్స్, మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. గుజరాత్ 11 మ్యాచ్‌లు ఆడిన 8 గెలిచి మూడు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలవగా మూడు ఓడిపోయింది. అయితే రన్‌రేట్ గుజరాత్‌కు ఎక్కువగా ఉండటంతో మొదటి ప్లేస్‌లో ఉంది. పంజాబ్ కింగ్స్ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి 7 గెలవగా.. 3 ఓడిపోయింది. మరి ఐపీఎల్ సీజన్ 2025 వాయిదా మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయో చూడాలి.
IPL Suspended
Meanwhile CSK,RR and SRH#IPL2025 pic.twitter.com/DIgXDAiyGX
— Rocky (@Nuthanrocky4) May 9, 2025