IPL 2025: నిన్న ధర్మశాల వేదికగా జరిగిన ఢిల్లీ – పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ రద్దు కావడంతో ఐపీఎల్ కూడా ఈ సీజన్లో రద్దు చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. దానికి తోడు బిసిసిఐ శుక్రవారం అర్ధాంతరంగా భేటీ కావడంతో ఐపీఎల్ రద్దు విషయంలో అందరికీ ఒక స్పష్టత వచ్చింది. అయితే ఐపీఎల్ రద్దుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎట్టకేలకు నోరు విప్పింది. ప్లేయర్లు చేస్తున్న విజ్ఞప్తులు.. యాజమాన్యాలు చేస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఒక వారం పాటు టోర్నీని నిలుపుదల చేస్తున్నట్టు బిసిసిఐ వెల్లడించింది. ప్రస్తుత ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాయుధ బలగాలకు తమ వంతుగా తోడ్పాటు ఇవ్వాలని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకుందామని బీసీసీఐ వెల్లడించింది. దేశ సమగ్రత కోసం పాటుపడుతున్న భారత త్రివిధ దళాలకు తాము సెల్యూట్ చేస్తున్నామని బీసీసీఐ వెల్లడించింది.. ఇదే విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సామాజిక మాధ్యమాల వేదికగా శుక్రవారం పేర్కొంది. ” యాజమాన్యాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వారి ప్లేయర్లనుంచి వినతులు కూడా వస్తున్నాయి. వాటి మొత్తాన్ని లెక్కలోకి తీసుకున్నాం. ఐపీఎల్ 2025 సీజన్ ను ఒక వారం పాటు నిలుపుదల చేస్తున్నాం.. బ్రాడ్ కాస్టర్, స్పాన్సర్స్.. వంటి వారితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది..” భారత త్రివిధ దళాల బలం మాకు తెలుసు. వారి సంసిద్ధతపై మాకు పూర్తిస్థాయిలో విశ్వాసం ఉంది. బోర్డు వాటాదారుల సమష్టి ప్రయోజనం కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నామని” ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. ” ఇది అత్యంత కఠినమైన సమయం. ఈ సమయంలో దేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. భారత దళాలకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం.. ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న భారత బలగాలకు సెల్యూట్ చేస్తున్నాం.. శత్రుదేశం చేసిన పన్నాగాలను ధైర్యంగా తిప్పి కొట్టిన భారత దళాలకు మేము శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం. వారి ధైర్యసాహసాలకు జేజేలు పలుకుతున్నామని” ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సోషల్ మీడియాలలో చేసిన పోస్టులలో పేర్కొంది.
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
బిసిసిఐ సెక్రటరీ కీలక ప్రకటన
సోషల్ మీడియాలో చేసిన పోస్టుల తర్వాత బీసీసీ సెక్రెటరీ దేవజిత్ సైకియా కీలక ప్రకటన వెల్లడించారు..”ఐపీఎల్ లో భాగస్వాములు, ఇతరులతో తీవ్రంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. త్వరలో ఐపీఎల్ 2025 కు సంబంధించి తదుపరి షెడ్యూల్ వెల్లడిస్తాం. క్రికెట్ ను మనదేశంలో ఎక్కువ మంది చూస్తారు. కానీ దేశ భద్రత కంటే అది ఎక్కువ కాదు. దేశ ప్రయోజనాల తర్వాతే ఏదైనా. బీసీసీఐ కూడా దానిని పాటిస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచిన వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.. వారం తర్వాత పరిస్థితి మునుపటిలాగా మారితే అప్పుడు ఐపీఎల్ నిర్వహణ సాధ్యమవుతుందని” ఆయన వెల్లడించారు. మొత్తంగా చూస్తే మరో వారం తర్వాత ఐపీఎల్ పునః ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
TATA IPL 2025 suspended for one week.
More details here | #TATAIPL
— IndianPremierLeague (@IPL) May 9, 2025