Mumbai Indians: ఏడాది క్రితం ముంబై జట్టు నాయకుడిగా హార్దిక్ పాండ్యా నియమితుడయ్యాడు. జట్టు మేనేజ్మెంట్ అయితే అతడిని నాయకుడిని చేసింది గాని.. అతనికి జట్టులో అనుకూల పరిస్థితులను కల్పించలేకపోయింది. హార్థిక్ పాండ్యా నాయకత్వాన్ని జట్టులో మెజారిటీ ప్లేయర్లు విభేదించారు. అతనికి కనీసం సహకారం కూడా అందించలేకపోయారు. దీంతో ఒక్కడే జట్టు భారాన్ని మోయలేక చతికిలపడ్డాడు. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫలితంగా ముంబై జట్టు ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన స్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేకపోయింది. గ్రూప్ దశ నుంచే అత్యంత అవమానకరమైన స్థితిలో ఇంటికి వెళ్లిపోయింది.. ఈ దశలో ముంబై యాజమాన్యంపై.. ముంబై ఆటగాళ్లపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ఒక్క సమాధానం కూడా రాలేదు. మెగా వేలంలో మామూలు ప్లేయర్లను కొనుగోలు చేయడంతో.. ఈసారి ముంబై జట్టు అస్సామే వెళ్తుందని అందరూ అనుకున్నారు.
Also Read: గ్రూప్ సమరం ముగిసినట్టే.. తుది రేసులో నిలిచిన జట్లు ఇవే.. పోటీ ఎలా ఉండబోతుంది అంటే?
ముంబై జట్టు ఈసారి సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రారంభంలో వరుస ఓటములు ఎదుర్కొన్న ముంబై జట్టు.. ఆ తర్వాత వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్ ఆశలను దాదాపు సజీవంగా ఉంచుకుంది. ప్లే ఆఫ్ ముందు గుజరాత్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఢిల్లీ పై అద్భుతమైన విజయాన్ని అందుకొని ఏకంగా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. అయితే ఈసారి ముంబై జట్టులో బౌలింగ్ అద్భుతంగా ఉంది. దీపక్ చాహర్, బుమ్రా, శాంట్నర్, బౌల్ట్ వంటి వారితో బలంగా కనిపిస్తోంది. వీరంతా కూడా ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. మరోవైపు రికెల్టన్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్, తిలక్ వర్మ వంటి వారు అదరగొడుతున్నారు. మొత్తంగా అటు బ్యాటింగ్.. బౌలింగ్లో ముంబై జట్టు తిరుగులేని స్థాయిలో ఉంది. దీంతో గత వైఫల్యాలకు చెక్ పెడుతూ.. ఈ సీజన్లో సరికొత్తగా కనిపిస్తోంది. ఐదు సార్లు విజేతగా నిలిచిన హార్దిక్ సేన.. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా ఆట తీరు కొనసాగిస్తూ.. విజేతగా నిలవడానికి తహతహలాడుతోంది.
హార్దిక్ పాండ్యాను సారధిగా చేస్తే రోహిత్ అభిమానులు మైదానంలో వీరంగం సృష్టించారు. హార్థిక్ పాండ్యా కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. చివరికి ఏడాది గడిచేసరికి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మేనేజ్మెంట్ సీరియస్ గా దృష్టి సారించడం.. ప్లేయర్లు కూడా కసి కొద్ది ఆడాలని భావించడంతో.. మొత్తంగా ముంబై జట్టు రాత మారిపోయింది. ప్లే ఆఫ్ లోకి ఆలస్యంగా వెళ్ళినప్పటికీ.. టైటిల్ ఫేవరెట్ గా మిగతా జట్ల కంటే ముంబై జట్టు కాస్త ఎక్కువ బలంగా కనిపిస్తోంది. ముంబై జట్టు ఈసారి విజేతగా నిలుస్తుందా? కప్ సాధిస్తుందా? చూడాలి మరి ఏం జరుగుతుందో..