IPL 2025 : లక్నో జట్టు ఖాతాలో ప్రస్తుతం ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. లక్నో జట్టు ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. ఇక ఈ క్రమంలో లక్నో జట్టు ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్ జట్టు జరిగే మ్యాచ్ లో తలపడనుంది. లక్నో జట్టులో ప్రస్తుతం మెరుగైన బౌలర్లు ఉన్నప్పటికీ.. మ్యాచ్ ను సమూలంగా మార్చివేసే బౌలర్ మాత్రం లేడు. అయితే ఇప్పుడు ఆ లోటు భర్తీ కానుంది.. దీనికి సంబంధించిన వీడియోను లక్నో జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.
Also Read : ఐపీఎల్ లో ఫిక్సింగ్ కు హైదరాబాద్ వ్యాపారి కుట్ర.. వెలుగులోకి సంచలన నిజాలు..
20 లక్షలకు కొనుగోలు
మాయాంక్ యాదవ్ ను లక్నో జట్టు 20 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో లక్నోలో పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా మాయాంక్ యాదవ్ ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు మ్యాచ్లు ఆడిన అతడు.. 73 బంతులు వేసి.. 85 పరుగులు చేశాడు. 7 వికెట్లు పడగొట్టాడు.. ఇతడి ఉత్తమ ప్రదర్శన 3/34. ఇతడి యావరేజ్ 12.14 గా ఉంది. ఎకానమీ 6.99 గా నమోదు చేశాడు. గత సీజన్లో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అత్యంత వేగంగా బంతులు వేశాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు సాధించాడు. అతడు గరిష్టంగా 155.8 కిలోమీటర్లు (గంటకు) వేగంతో బంతులు వేశాడు. ఇక రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో తన వేగాన్ని మయాంక్ యాదవ్ 156.7 కిలోమీటర్లకు పెంచుకున్నాడు. ఇది ఐపిఎల్ లో అత్యంత వేగవంతమైన బంతిగా నమోదయింది. అతడు నాలుగు ఓవర్లు వేసి.. 14 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ప్రతి బంతిని గంటకు 150 కిలోమీటర్ల వేగానికి తక్కువ కాకుండా వేశాడు. అంతేకాదు అతడు మొదటి రెండు మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.. అయితే మయాంక్ గత సీజన్లో గాయపడిన నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఇక అప్పట్నుంచి అతడుచికిత్సకి పరిమితమయ్యాడు. ఇప్పుడు కోలుకుని లక్నో జట్టులోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే విషయాన్ని లక్నో జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.. ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో మయాంక్ యాదవ్ తమతో భాగస్వామి అవుతాడని లక్నో జట్టు ప్రకటించింది. మయాంక్ యాదవ్ జట్టులోకి రావడం వల్ల బౌలింగ్ మరింత బలోపేతం అవుతుందని లక్నో యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు మయాంక్ యాదవ్ కూడా తన ప్రతిభను చూపించుకోవాలని భావిస్తున్నాడు. గత సీజన్లో నాలుగు మ్యాచ్లకు మాత్రమే పరిమితమైన అతడు.. ఈసారి సిరీస్ మొత్తం ఆడాలని యోచిస్తున్నాడు.
MAYANK YADAV HAS JOINED LSG. pic.twitter.com/zTipq76IJK
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2025