IPL 2025 (2)
IPL 2025: తొలి మ్యాచ్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది. సీజన్లో బెంగళూరు జట్టు రెండుసార్లు కోల్ కతా తో పోటీపడి ఓటమిపాలైంది. ఈసారి కోల్ కతా అజింక్యా రహానే నాయకత్వం వహిస్తున్నాడు. బెంగళూరు జుట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్ గా ఉన్నాడు. వీరిద్దరి ఆధ్వర్యంలో కోల్ కతా, బెంగళూరు జట్లు పోటీపడుతున్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ విషయాన్ని పక్కన పెడితే.. ఈసారి జరిగే ఐపీఎల్ సీజన్లో కెప్టెన్ల జీతాలకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.. వాస్తవానికి కోల్ కతా జట్టుకు నాయకత్వం వహిస్తున్న అజింక్యా రహానే వేతనం తక్కువ ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తున్నది. గత సీజన్లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచింది. అప్పుడు ఆ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. ప్రస్తుతం అతడు పంజాబ్ జట్టుకు మారిపోయాడు. గత ఏడాది జరిగిన మెగా వేలంలో అతడిని కోల్ కతా జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడిని పంజాబ్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది. అయ్యర్ వెళ్లిపోవడంతో అజింక్యా రహానే కు కోల్ కతా యాజమాన్యం జట్టు పగ్గాలు అప్పగించింది. జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ రహానే వేతనం 1.5 కోట్లు కావడం విశేషం.
అత్యధికం ఎవరికంటే
గత సీజన్లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు. అయితే అతడిని ఢిల్లీ యాజమాన్యం రిటైన్ చేసుకోలేదు. దీంతో లక్నో యాజమాన్యం అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది గత ఏడాది జరిగిన మెగా వేలంలో రిషబ్ పంత్ ను లక్నో యాజమాన్యం 27 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 10వ సీజన్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న కెప్టెన్ గా పంత్ రికార్డు సృష్టించాడు. రిషబ్ పంత్ తర్వాత పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండవ హైయెస్ట్ పెయిడ్ కెప్టెన్ గా నిలిచాడు. అతడిని పంజాబ్ జట్టు గత మెగా వేలంలో 26.75 కోట్లకు పర్చేజ్ చేసింది. ఇక చెన్నై జట్టు యాజమాన్యం రుతు రాజ్ గైక్వాడ్ కు 18 కోట్లు చెల్లిస్తోంది. రాజస్థాన్ జట్టు యాజమాన్యం సంజు శాంసన్ కు 18 కోట్లు చెల్లిస్తోంది. హైదరాబాద్ జట్టు యాజమాన్యం కమిన్స్ కు 18 కోట్లు చెల్లిస్తోంది.. ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర పటేల్ కు 16.5 కోట్లు, గుజరాత్ జట్టు యాజమాన్యం గిల్ కు 16.5 కోట్లు, ముంబై జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యా కు 16.35 కోట్లు, రజత్ పాటిధార్ కు బెంగళూరు జట్టు యాజమాన్యం 11 కోట్లు చెల్లిస్తోంది. ఐతే ఈ సీజన్లో ఏ కెప్టెన్ జట్టును విజేతగా నిలుపుతాడో.. జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా కాపాడుకుంటాడో.. మరి కొద్ది రోజులు గడిస్తే గాని తెలియదు.