IPL 2025 : కానీ అదేం దరిద్రమో తెలియడం లేదు.. ఆరు మ్యాచ్లో కలిపి 32 పరుగులు చేసిన ఆటగాడికి విపరీతంగా అవకాశాలు లభిస్తున్నాయి. అతడే వన్ డౌన్ ఆటగాడిగా వస్తున్నాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. అతగాడి నిర్లక్ష్యం వల్ల ఆ జట్టు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఆటగాడు తన తీరు మార్చుకోవడం లేదు. ఆటతీరులో మార్పు చూపించడం లేదు. ఇంతకీ ఆ జట్టు ఏది? ఆ ఆటగాడు ఎవరు? అతని వైఫల్యం వల్ల ఆ జట్టు ఎలాంటి ఇబ్బందులు పడుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : సన్ రైజర్స్ హైదరాబాద్ గుట్టు పట్టేశాయి.. ఆ ప్రణాళికతో ఓడిస్తున్న ప్రత్యర్థి జట్లు
ఐపీఎల్ 18వ ఎడిషన్ లో హైదరాబాద్ జట్టు రాజస్థాన్ పై 200కు మించి పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ 18 ఎడిషన్ లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఇషాన్ కిషన్ ఎంపిక సరైన నిర్ణయం అని.. 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కావ్య మారన్ అద్భుతమైన నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపించాయి. ఆరంభ శూరత్వం లాగా ఇషాన్ కిషన్ రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత.. మిగతా ఆరు మ్యాచులలో దారుణంగా 32 పరుగులు మాత్రమే చేశాడు. ఏ ఒక్క మ్యాచ్లో కూడా ఇది నా ఇన్నింగ్స్ అని చెప్పుకునే స్థాయిలో అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. అతడు సరిగ్గా పరుగులు చేయకపోవడం వల్ల ఆ ప్రభావం జట్టు విజయాలపై చూపిస్తోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుతో సుదీర్ఘకాలం ఆడిన ఇషాన్ కిషన్.. గురువారం నాటి మ్యాచ్లో తేలిపోయాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. వన్ డౌన్ ఆటగాడు అలా విఫలం కావడానికి హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. రాజస్థాన్ జట్టుపై సెంచరీ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ 6 మ్యాచులలో కేవలం 32 పరుగులు మాత్రమే చేయడాన్ని హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత.. హైదరాబాద్ అభిమానులు ఇషాన్ కిషన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు..” తొలి మ్యాచ్లో సెంచరీ చేశావు. మాకు గొప్పగా అనిపించింది. గొప్ప ఆటగాడు మా జట్టులోకి వచ్చాడు అనిపించింది. కానీ అదంతా ఆరంభ శూరత్వం మాత్రమేనని నిరూపించావు. దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నావు. 11 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఇలానేనా ఆడేది అంటూ” సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆటగాడు. బంతులను ఫర్ఫెక్ట్ అంచనాతో కొడతాడు. కానీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. బంతులను అంచనా వేయలేక కొట్టి అవుట్ అవుతున్నాడు.
Also Read : ముంబై పై ఓడిపోయినా.. SRH కు ప్లే ఆఫ్ అవకాశం.. దానికోసం ఏం చేయాలంటే?