Cricketers Funny Names
IPL 2025 : ఆర్థికంగా స్తోమత ఉన్నవారు మైదానంలోకి వెళ్లి మ్యాచ్ చూడడం ఎక్కువైంది. మనదేశంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టే.. ఐపీఎల్ కు విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నది. ఇక సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఐపీఎల్ సీజన్ లో రకరకాల వీడియోలు అందుబాటులోకి రావడం కూడా పెరిగిపోయింది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. విపరీతమైన చర్చకు కారణమవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఎలా ఉంది.. ఆ వీడియోను ఎలా రూపొందించారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి.. అసలు ఇంతటి ఆలోచనసామర్థ్యం మామూలుగా లేదనే ప్రశ్నలు ఆ వీడియోని చూసిన తర్వాత మీలో కచ్చితంగా మెదులుతాయి.
Also Read : పిచ్చెక్కి పిచ్చకొట్టుడు కొట్టాలి.. అదే SRH ప్లాన్.. వైరల్ వీడియో!
వాటితో సంబంధం పెట్టారు..
మనదేశంలో కొన్ని ప్రాంతాలు క్రికెటర్ల పేర్లు విచిత్రంగా ఉంటాయి. ఇక ఇతర దేశాల క్రికెటర్ల పేర్లు కూడా అలానే ఉంటాయి. కాకపోతే ఆటగాళ్ల పేర్లు వారి సంస్కృతి సంప్రదాయాలను పోలి ఉంటాయి. దక్షిణ భారత దేశంలో ఎక్కువగా దేవుళ్ళ పేర్లు ఎక్కువగా పెట్టుకుంటారు. అదే ఇతర దేశాల్లో క్యాచీ నేమ్స్ పెట్టుకుంటారు. అంతిమంగా పేరు నలుగురినోళ్లల్లో నానాలని.. ఎప్పటికప్పుడు వారి పేరు ప్రస్తావనకు రావాలని భావిస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడం.. అందులోనూ కొంతమంది క్రియేటివ్ గా ఆలోచించడంతో కొత్త కొత్త వీడియోలు వస్తున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది కాబట్టి చాలామంది క్రియేటర్లు కొత్తగా ఆలోచించి.. క్రికెటర్ల పేర్ల మీద వీడియోలు రూపొందించారు. కాకపోతే వాటికి ప్రకృతిలో ఉన్న వస్తువులతో ముడి పెట్టడం ఇక్కడ గమనార్హం.
వాటే క్రియేటివిటీ
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో క్వింటన్ డికాక్ అనే ఆటగాడున్నాడు. అతడి పేరుకు చివర్లో కాక్ అనే పదం ఉండడంతో.. క్వింటన్ ఫోటో పక్కన కోడిపుంజు ఫోటోలు పెట్టి క్వింటన్ డి+ కాక్ = క్వింటన్ డికాక్ అని, రాజస్థాన్ కెప్టెన్ సంజు + సామ్ సంగ్ ఫోన్ ను పక్కనపెట్టి సంజు సాంసన్ అని.. హైదరాబాద్ ఆటగాడు గ్లెన్ + ఫిలిప్స్ బల్బును పక్కనపెట్టి.. గ్లెన్ ఫిలిప్స్ అని.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆంగ్రి + బర్గర్ ఫోటో పెట్టి.. ఆంగ్రి బర్గర్ అని.. బెంగళూరు జట్టు ఆటగాడు ఫిల్ ఫోటో పక్కన + సాల్ట్ ను పెట్టి ఫిల్ సాల్ట్ అని.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు కేశవ్ ఫోటో పక్కన + మహారాజ్ ఫోటోను పెట్టి కేశవ్ మహారాజ్ అని.. బెంగళూరు ఆటగాడు మిచెల్ ఫోటో పక్కన మార్ష్ గ్రహం ఫోటో పెట్టి.. మిచల్ మార్ష్ అని.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ఎంగిడి ఫోటో పక్కన లుంగీ ఫోటో పెట్టి లుంగీ ఎంగిడి అని.. చెన్నై జట్టు మాజీ ఆటగాడు బ్రావో ఫోటో పక్కన డీజే ఫోటో పెట్టి డీజే బ్రావో ఇతడే అని.. ఢిల్లీ జట్టు మాజీ ఆటగాడు షా పక్కన పృద్వి ఫోటో పెట్టి.. ఇతడే పృథ్వీషా అని.. వీడియో రూపొందించారు. ఆటగాళ్ల ఫోటోలను.. వారి పేరును ప్రతిబించే వస్తువులను పక్కపక్కన పెట్టి అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనగా మారింది. ఐపీఎల్ సీజన్ మొదలై ఇప్పటికే మూడు రోజులైంది. సోషల్ మీడియాలో ఐపిఎల్ కు సంబంధించిన వీడియోలు ఊపేస్తున్నాయి. టోర్నీ ముగిసే వరకు ఎలాంటి వీడియోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతాయో చూడాల్సి ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఫస్ట్రేషన్ తగ్గలేదా రోహిత్తూ.. ఎందుకిలా ఆడుతున్నావ్?