IPL 2025: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు అత్యంత అవమానకరంగా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ సీజన్లో గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లిపోయిన తొలి జట్టుగా చెన్నై నిలిచింది.. వరుస సీజన్లో చెన్నై జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోవడం విశేషం.. అంతేకాదు చెన్నై జట్టు సొంతవేదికపై ఒకే సీజన్లో అత్యధిక ఓటములను చవిచూసిది.. 2012లో (ఫైనల్స్ తో సహా 10 మ్యాచ్ లు) నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది. 2008లో (ఏడు మ్యాచ్లు) నాలుగు మ్యాచ్లలో ఓటమిపాలైంది. 2025లో (ఆరు మ్యాచులు) ఐదింట్లో ఓడిపోయింది. ఇక పంజాబ్ జట్టు గడచిన 8 మ్యాచ్లలో.. ఏడింట్లో చెన్నై జట్టును ఓడించింది. సొంత మైదానంలో చెన్నై జట్టు వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోవడం విశేషం. ఇక చెన్నై జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఇటీవల కాలంలో చెన్నై జట్టుపై తొమ్మిది మ్యాచ్లలో తలపడగా.. ఐదింట్లో గెలిచింది. పంజాబ్ జట్టు 9 మ్యాచ్లలో తలపడగా.. ఐదుసార్లు విజయం సాధించింది..కోల్ కతా నైట్ రైడర్స్ 12 మ్యాచ్లలో తలపడగా.. నాలుగింట్లో గెలుపును సొంతం చేసుకుంది.
Also Read: రక్తం ఉడికి పోతోంది.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోతున్నా: శిఖర్ ధావన్
ఈ సీజన్లో
ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు పది మ్యాచ్లు ఆడింది. కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. 8 మ్యాచ్లలో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా గ్రూపు దశ నుంచే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సొంతమైదానంపై చెన్నై జట్టు ఐదు మ్యాచ్లు ఆడగా.. ఐదింట్లో కూడా ఓడిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో పోటీ పడి ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడి ఓడిపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో పోటీపడి ఓటమిపాలైంది.. హైదరాబాద్ తో పోటీపడి.. దాంతో కూడా ఓడిపోయింది . చివరికి పంజాబ్ జట్టుతో తలపడి.. ఆ జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. పాయింట్లు పరంగా చెన్నై జట్టుకు 2025 సీజన్ ఏమాత్రం కలిసి రాలేదు… పైగా సొంతమైదానంలో ఐదు ఓటములతో కనివిని ఎరుగని స్థాయిలో దారుణమైన చెత్త రికార్డును చెన్నై జట్టు సొంతం చేసుకుంది.. మొత్తంగా చూస్తే చెన్నై జట్టు ఈ సీజన్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు సగటు చెన్నై అభిమానికి ఆవేదనను మిగిల్చింది.. బ్యాటింగ్లో సత్తా లేదు. బౌలింగ్లో ఆకర్షణ లేదు. ఫీల్డింగ్ లో గొప్పతనం లేదు.. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటలో అద్భుతం లేదు. ఫలితంగా చెన్నై జట్టు అత్యంత నిరాశజనకంగా ఈ సీజన్ లో ఆడింది. గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.
Also Read: యజువేంద్ర చాహల్ “తీన్ మార్”.. ధనశ్రీ ఎఫెక్ట్ నుంచి బయటపడ్డట్టేనా..