IPL 2025: గత సీజన్లో రాజస్థాన్ జట్టు సోలార్ దీపాలను అక్కడి ప్రజలకు అందించింది. ఇక 2011 నుంచి బెంగళూరు జట్టు ప్రతి సీజన్లో ఒకరోజు గ్రీన్ జెర్సీ ధరించి.. పర్యావరణహిత కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇక అప్పుడప్పుడు మొక్కలు కూడా నాటుతోంది . హైదరాబాద్ జట్టు తమ ఆటగాళ్లను వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడ ఉండే వారికి పండ్లు, దుస్తులు, ఔషధాలు అందిస్తూ ఉంటుంది. ఇక మిగతా జట్లు కూడా వారి వారి స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. మొత్తంగా ఐపీఎల్ అంటే డబ్బు మాత్రమే కాదని.. సమాజ హితం కూడా ఉంటుందని నిరూపిస్తుంటాయి.. అయితే ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు వీక్షిస్తున్న వారు.. డాట్ బాల్స్ కు బిసిసిఐ మొక్కలు నాటుతుందనే విషయాన్ని తెలుసుకునే ఉంటారు. లేదా చూసే ఉంటారు.. డాడ్ బాల్స్ కు మొక్కలు నాటడం అనేది మంచి కార్యక్రమం అయినప్పటికీ.. ఇంతకీ బీసీసీఐ మొక్కలను ఎక్కడ నడుస్తుందో మాత్రం వారికి తెలియదు. అయితే డాట్ బాల్స్ కు బిసిసిఐ మొక్కలు ఎక్కడ నాటుతుందో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: రోహిత్, విరాట్ రిటైర్మెంట్ పై.. గేల్ సంచలన వ్యాఖ్యలు..
టాటా గ్రూప్ తో కలిసి 2023లో..
మొక్కలు నాటే కార్యక్రమాన్ని బిసిసిఐ 2023 నుంచి టాటా కంపెనీ తో కలిసి మొదలుపెట్టేది.. ఐపీఎల్ 200024లో ప్లే ఆఫ్ లో దాదాపు 1,47 వేల మొక్కలను నాటారు. అయితే వీటికి సంబంధించి బీసీసీఐ అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.. గతంలో ప్లే ఆప్స్ లో ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు చొప్పున నాటుతామని బీసీసీఐ ప్రకటించింది. దానికి సంబంధించి స్పందన కూడా విపరీతంగా వచ్చింది. ఇక వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లోనూ ఇదే విధానాన్ని ప్రవేశపెడతామని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుత ఐపీఎల్లో ప్రతి డాట్ బాల్ కు 18 మొక్కలు చొప్పున నాటుతామని బీసీసీఐ పేర్కొంది.. ఐపీఎల్ లో 2024 సీజన్ కు సంబంధించి ప్లే ఆప్స్ లో నమోదైన డాట్ బాల్స్ ను లెక్కిస్తే మొత్తంగా 1,47,000 మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుత సీజన్లో ఇప్పటికే చాలా వరకు డాట్ బాల్స్ నమోదయ్యాయి. ప్రతి డాట్ బాల్ కు 18 మొక్కలు చొప్పున నాటాలంటే మొత్తంగా 32వేలకు పైగా మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఇక ఈ సీజన్ పూర్తయ్యే వరకు మొత్తంగా అది లక్ష మొక్కలు నాటే వరకు పెరుగుతుంది. అయితే ఇన్ని మొక్కలు గనుక నాటితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
డాట్ బాల్ పడితే
సాధారణంగా ఐపీఎల్ లో అభిమాన ఆటగాడు ఫోర్ లేదా సిక్సర్ కొడితే.. అభిమానుల ఆనందానికి అవధి ఉండదు. ఇప్పుడు డాట్ బాల్స్ పడితే కూడా అభిమానులు అదేవిధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఈ మొక్కలను బిసిసిఐ గతంలో ఎక్కడ నాటింది.. ఇప్పుడు ఎక్కడ నాటబోతోంది.. వీటి సంరక్షణ ఎవరు చూస్తున్నారు.. గతంలో నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి.. అనే ప్రశ్నలు తలెత్తడం సర్వసాధారణం. అయితే వీటికి సంబంధించి స్పష్టమైన సమాధానాలను బీసీసీఐ ఇంతవరకు వెల్లడించలేదు. అయితే బెంగళూరులో బీసీసీఐ కొత్తగా నేషనల్ క్రికెట్ అకాడమీని నిర్మించింది. దీనిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కూడా పిలుస్తున్నారు. ఇక్కడ బీసీసీఐ నాలుగు లక్షల వరకు మొక్కలు నాటిన తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మొక్కలాటిన ఫోటోను బిసిసిఐ అప్పట్లో సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. కేరళ, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో కూడా బీసీసీఐ మొక్కలు నాటిందని సమాచారం. అయితే మొక్కలు నాటిన ప్రదేశాలను మాత్రం బిసిసిఐ వెల్లడించడం లేదు. అయితే బీసీసీఐ చేసిన ఈ పర్యావరణహితమైన కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక బయటికి విడుదలయితే.. పర్యావరణ ప్రేమికులు ఎగిరి గంతులు వేస్తారు.
IPL 2025 Plants for Dot Ball.
Where is @BCCI plants planting ?#IPL2025 #plants pic.twitter.com/iSIXiqcWaf— GANEℍ (@kanemama24) April 14, 2025