Virat Kohli
Virat Kohli: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా శుక్రవారం బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఏకపక్ష విజయాన్ని సాధించింది. దీంతో బెంగళూరు జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సొంత మైదానంలో ఓడిపోవడం ఏంటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఆట తీరు పట్ల సీనియర్ ఆటగాళ్లు విస్మయ వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియాలో నెటిజెన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.. విరాట్ కోహ్లీ ఇలాగే ఆడితే వచ్చే టి20 వరల్డ్ కప్ లో టీమిండియాలో చోటు సంపాదించుకోవడం కష్టమేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు.. అతడు 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన అతడు.. చివరి వరకు ఆడాడు. అతడు ఆ స్థాయిలో ఆడుకుంటే బెంగళూరు 130 లేదా 140 మధ్యలోనే ఆల్ అవుట్ అయ్యేది.గ్రీన్, ఇతర ఆటగాళ్లతో కలిసి విరాట్ కోహ్లీ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దినేష్ కార్తీక్ తో కలిసి చివర్లోనూ మెరుపులు మెరిపించాడు.
విరాట్ కోహ్లీ ఆట తీరు పట్ల మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు అలా ఆడకుండా ఉండి ఉంటే బెంగళూరు తక్కువ స్కోర్ కే ఆల్ అవుట్ అయ్యేదని అభిప్రాయపడ్డాడు. మరి కొంతమంది క్రికెటర్లు కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు.” కోహ్లీ బ్యాటింగ్ బాగుంది. కానీ అతడు ప్రారంభ ఓవర్లలో నిదానంగా ఆడాడు. టి20 లో ఇలా ఆడితే కుదరదు. కోల్ కతా ఆటగాడు అయ్యర్ చెప్పినట్టు.. ఈ మైదానంలో ఓ ఎండ్ స్లో వికెట్ గా ఉంది. అలాంటప్పుడు బ్యాటింగ్ చేయడం సులువవుతుంది.. కానీ విరాట్ కోహ్లీ అలా చేయలేదు. మొదట్లో జిడ్డు బ్యాటింగ్ చేయడం వల్ల.. స్కోరు నెమ్మదించింది. అలా కాకుండా అతడు ధాటిగా ఆడి ఉండి ఉంటే స్కోర్ పెరిగేది. దేశంలోని సొంత మైదానాలలోనే ఇలా ఆడితే విరాట్ కోహ్లీకి టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కేది అనుమానమేనని” వారు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు విరాట్ కోహ్లీకి అండగా ఉంటున్నారు. విరాట్ కోహ్లీ ఆడిన ఆట బాగుందని కితాబిస్తున్నారు. ” డూప్లెసిస్ నుంచి మొదలుపెడితే కీలక ఆటగాళ్ల వరకు వెంట వెంటనే అవుట్ అయ్యారు. మరోవైపు కోల్ కతా బౌలర్లు స్లో వికెట్ ను సద్వినియోగం చేసుకున్నారు.. అలాంటప్పుడు విరాట్ కోహ్లీ అలా గట్టిగా నిలబడితేనే బెంగళూరు ఆమాత్రమైనా స్కోరు సాధించిందని” వారు వ్యాఖ్యానిస్తున్నారు.. బెంగళూరు వరుసగా రెండవ ఓటమిని చవి చూడడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.