https://oktelugu.com/

Mobile Phone Charging: మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉండాలి?

మొబైల్ లో ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ కాకుండా చూసుకోవాలట. ఇక 80-90 శాతం కంటే పెంచకుండా కూడా ఉంటే చాలా మంచిదట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మంచిదట. ఎందుకంటే జీరో శాతం నుంచి ఛార్జింగ్ అవ్వడం లేట్ అయితే బ్యాటరీ చాలా వేడి అవుతుంది.

Written By: Swathi Chilukuri, Updated On : March 30, 2024 3:08 pm
Mobile Phone Charging

Mobile Phone Charging

Follow us on

Mobile Phone Charging: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. అయితే ఈ మొబైల్ బతికి ఉండాలంటే ఛార్జింగ్ అవసరం. కొందరు చార్జింగ్ ను తగ్గకుండా ఉండేలా చూసుకుంటారు. మాటి మాటికి చార్జింగ్ పెడుతూనే ఉంటారు. కొందరు పూర్తిగా స్విచ్ఛాఫ్ అయ్యే మూమెంట్ లో ఛార్జ్ చేస్తారు. ఇంతకీ ఛార్జింగ్ ఏ సమయంలో పెట్టాలి? ఎంత శాతం చార్జింగ్ అవసరం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ లో ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ కాకుండా చూసుకోవాలట. ఇక 80-90 శాతం కంటే పెంచకుండా కూడా ఉంటే చాలా మంచిదట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మంచిదట. ఎందుకంటే జీరో శాతం నుంచి ఛార్జింగ్ అవ్వడం లేట్ అయితే బ్యాటరీ చాలా వేడి అవుతుంది. దీని వల్ల నష్టమేనట. బ్యాటరీని ఎక్కువగా ఛార్జ్ చేస్తే ప్రమాదం లేదట. ఎందుకంటే సెల్ ఫోన్ బ్యాటరీల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవింవచవద్దని అంతర్నిర్మిత ఫీచర్ లను పొందుపరుస్తున్నారని నమ్ముతున్నారు.

అయితే జీరో శాతం చార్జింగ్ అయ్యే కంటే ముందే ఫోన్ అలర్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫోన్ ను ఎక్కువ కాలం వినియోగించాలి అనుకుంటే..ఛార్జింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆపిల్ ఫోన్స్ కు అయితే 50 శాతం చార్జింగ్ ను మాత్రమే సిఫార్సు చేస్తారట కంపెనీ. ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్ బ్యాటరీలు దెబ్బతినకూడదు అంటే చల్లని, పొడి ప్రదేశాలను ఎంచుకోవడం ఉత్తమం. చౌక ధరల చార్జర్ లు కూడా లభిస్తున్నాయి. కానీ అవి అసలు సురక్షితం కాదని గుర్తుంచుకోండి.

సెల్ ఫోన్ పనితనం సరిగా లేకపోయినా, చార్జింగ్ వల్ల అయినా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం దీని వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా బాత్ రూమ్ వంటి తేమతో కూడిన ప్రదేశాలలో ఈ మొబైల్ ఫోన్స్, చార్జర్ లను ఉంచడం మంచిది కాదట.