https://oktelugu.com/

SRH vs RR : ఇదేం ఆట హెడ్ భాయ్.. లీగ్ మ్యాచ్ అనుకున్నావా? అలా ఔట్ అవుతావా?

మరోవైపు తెలుగోడు నితీష్ రెడ్డి ఆవుటైన తీరు పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా షాట్ ఆడి వికెట్ పోగొట్టుకున్నాడని మండి పడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 24, 2024 / 09:25 PM IST

    Travis Head

    Follow us on

    SRH vs RR : కీలకమైన క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఊహించినట్టుగానే ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై మైదానం కూడా రాజస్థాన్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దీంతో హైదరాబాద్ జట్టుకు భారీ భాగస్వామ్యాలు నమోదు కాలేదు. తొలి ఓవర్ చివరి బంతికే ఓపెన్ అభిషేక్ శర్మ(12; ఐదు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ ) బౌల్ట్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. మైదానం మీద పచ్చిక ఉండడంతో రాజస్థాన్ బౌలర్లు మరిన్ని వికెట్లు తీస్తారని అందరూ అనుకున్నారు. కానీ, రాహుల్ త్రిపాఠి (37; 15 బంతుల్లో), హెడ్ దాటిగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు. వేగంగా కార్యక్రమంలో రాహుల్ బౌల్ట్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అప్పటికి హైదరాబాద్ జట్టు స్కోరు రెండు వికెట్లకు 55 పరుగులు.

    ఈ దశలో మార్క్రమ్ క్రీజ్ లోకి వచ్చాడు. ఒకే ఒక్క పరుగు చేసి బౌల్ట్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో 57 పరుగులకే హైదరాబాద్ కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెడ్ ధాటిగా ఆడాడు. క్లాసెన్ తో కలిసి 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ దశలో హెడ్ 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సందీప్ శర్మ బౌలింగ్లో రవిచంద్రన్ అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఆ బంతిని తప్పుగా అంచనా వేసిన హెడ్.. అనవసర షాట్ కు యత్నించి.. క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న హైదరాబాద్ జట్టు ఆశలు నీరు కారాయి.

    మరోవైపు తెలుగు తేజం నితీష్ రెడ్డి కూడా విఫలమయ్యాడు. ఐదు పరుగులు చేసి ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో అనవసరమైన స్వీప్ షాట్ ఆడి యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే అబ్దుల్ సమద్ కూడా క్లీన్ బౌల్డ్ కావడంతో హైదరాబాద్ జట్టు కోలుకోలేని కష్టాల్లో పడింది. ఒకానొక దశలో మూడు వికెట్లకు 120 పరుగుల వద్ద ఉన్న హైదరాబాద్.. ఆ తర్వాత వెంట వెంటనే మూడు వికెట్లను కోల్పోవడం విశేషం.

    హెడ్ అవుట్ అయిన తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. అనవసర షాట్ ఆడి అవుట్ అయ్యాడని విమర్శిస్తున్నారు. ధాటిగా ఆడాల్సిన క్రమంలో.. బంతిని అలా ఎలా అంచనా వేస్తాడని దెప్పి పొడుస్తున్నారు. మరోవైపు తెలుగోడు నితీష్ రెడ్డి ఆవుటైన తీరు పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా షాట్ ఆడి వికెట్ పోగొట్టుకున్నాడని మండి పడుతున్నారు.