Gold Ship : : ఒక దేశం సంపన్నమయ్యేంత బంగారం సముద్రగర్భంలో మునిగిపోయింది. ఈ బంగారం విషయంలో కొన్ని దేశాలు ఫైట్ చేసుకుంటున్నాయి. అసలు ఏంటా కథ? ఎక్కడిది ఆ బంగారం తెలుసుకుందాం.
టన్నుల కొద్దీ బంగారం, రత్నాభరణాలు, విలువైన బంగారు వస్తువులతో ఒక నౌక స్పెయిన్ దేశానికి బయల్దేరింది. బయల్దేరిన కొన్ని రోజులకే శత్రుదాడిలో నౌక మునిగిపోయింది. ఈ ఘటన 300 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఆ నిధి సముద్ర గర్భంలోనే ఉంది. కొన్నేళ్ల క్రితం దాన్ని గుర్తించినా.. వాటాల్లో తేడా రావడంతో ఎవరూ బయటకు తీసేందుకు ఇంట్రస్ట్ చూపలేదు. తాజాగా దాన్ని దక్కించుకునేందుకు ఓ దేశం వేగంగా పావులు కదుపుతుందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
కరేబియన్ సముద్ర గర్భంలో మునిగిన ‘శాన్‌జోస్’ అనే పురాతన నౌక కోసం తాము గాలించడం మొదలుపెడతామని కొలంబియా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో స్పెయిన్, అమెరికా, పెరూతో పాటు మరికొన్ని దేశాలు కూడా అప్రమత్తం అయ్యయి. దీనికి కారణం కూడా ఉంది. 1708లో స్పెయిన్ నౌక పెరూలోని 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలతో పనామా కాలువ మీదుగా కొలంబియాకు బయల్దేరింది. ఈ నౌకపై శత్రువులుదాడి చేశారు. నౌకలో రక్షణ సిబ్బంది 600 మంది ఉంటే చాలా మంది మరణించారు. నౌక సముద్ర గర్భంలో మునిగిపోయింది. కొందరు సురక్షితంగా బయటపడ్డారు. ఆ సంపద మొత్తం నాటి నుంచి సముద్రంలోని 600 మీటర్ల లోతున ఉన్న శిథిలాల కిందే ఉండిపోయింది. దీనికి ఉన్న 64 భారీ రాగి తుపాకులు కూడా అక్కడే ఉన్నాయి. ఈ నౌక మీద దాడి సమయంలో మరో నౌకపై కూడా దాడి జరిగింది. అయితే ఆ నౌక దాడినుంచి తప్పంచుకొని వెళ్లిపోయంది. .
కొలంబియా ప్రభుత్వం మునిగిపోయిన ఓడపై పరిశోధన మొదలు పెట్టినట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా ‘ది కొలంబియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐసీఏఎన్‌హెచ్)’ సంస్థ ప్రత్యేక రిమోట్ సెన్సర్లను వాడి నౌకను ఫొటో గ్రఫీ చేయాలని అనుకుంది. దీని ఆధారంగా పరిశోధన కొనసాగుతుందని పేర్కొంది. ఈ పూర్తి సమాచారం తర్వాత నౌక నుంచి పురాతన వస్తువులు, సంపద వెలికితీస్తామని ప్రకటించింది. ఈ నౌక మునిగిన ప్రదేశాన్ని ఐసీఏఎన్‌హెచ్ రక్షిత పురాతత్వ ప్రదేశంగా ప్రకటించింది.
ఈ సంపదకు యజమానులు ఎవరు?
అమెరికాకు చెందిన సముద్ర గర్భాన్వేషణ సంస్థ (సీసెర్చి ఆర్మడా (ఎస్‌ఎస్‌ఏ)’ 1981లో ఈ నౌక శకలాలను కనుగొంది. కానీ కొలంబియాతో ఒప్పందం కలిసిరాలేదు. ఆ దేశం ఈ నిధిపై పూర్తి హక్కు తమదేనని ప్రకటించింది. ఎస్ఎస్ఏ సంస్థకు కేవలం 5 శాతం ఫీజు కింద చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేసింది. రెండు సార్లు కూడా ఆ సంపదపై కొలంబియాకే హక్కు ఉందనికోర్టు తీర్పు ఇచ్చింది.
2015లో శాన్‌జోస్ నౌకను స్వయంగా కనుగొన్నామని కొలంబియా ప్రకటించింది. భారీ రాగి తుపాకులు కూడా ఉన్నాయని పేర్కొంది. దీన్ని వెలికి తీసేందుకు బ్రిటీస్ అమెరికా అమెరికా కంపెనీల సాయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ‘ఎస్‌ఎస్‌ఏ’ పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో 10 బిలియన్ డాలర్లకు కొలంబియాపై కేసు వేసింది. మరోవైపు స్పెయిన్, పెరూ ప్రభుత్వాలు కూడా నౌకపై యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయని చెబుతున్నాయి. కానీ, నౌక మునిగిపోయిన ప్రాంతాన్ని మాత్రం కొలంబియా, ఎస్ఎస్‌ఏ కంపెనీ గోప్యంగా ఉంచాయి.