amazing spin squad teams in IPL 2024
IPL 2024: అన్నిసార్లు బంతులను వేగంగా సంధించడం కుదరదు. కొన్నిసార్లు మెలి తిప్పాలి కూడా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి మైదానాలపై బంతులను వేగంగా సంధించవచ్చు. కానీ మనదేశంలో మైదానాలపై బంతులను వేగంగా వేయడమే కాదు.. మెలి తిప్పడం కూడా తెలిసి ఉండాలి. అప్పుడే బౌలర్లు రాణిస్తారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించి వివిధ జట్లలో బంతులను మెలి తిప్పగల సామర్థ్యం ఉన్న బౌలర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
లక్నో సూపర్ జెయింట్స్
పూర్తి యువరక్తంతో కూడి ఉన్న ఈ జట్టులో.. రవి బిష్నోయ్, అమిత్ మిశ్రా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్ వంటి బౌలర్లతో అత్యుత్తమ స్పిన్ స్క్వాడ్ తో ఈ జట్టు అలరారుతోంది. గత సీజన్లో ఈ బౌలర్లు మెరుపులు మెరిపించారు. ఈ సీజన్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్
కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్. ఈ ఐదుగురూ ఢిల్లీ జట్టు తురుపు ముక్కలు. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ లో చెమటలు చిందిస్తున్నారు. గత సీజన్లో వీరు ఢిల్లీ జట్టుకు ఆశించినంత స్థాయిలో విజయాలు అందించకపోయినప్పటికీ.. ఈసారి తమ సత్తా చాటుతామని చెబుతున్నారు.
కోల్ కతా నైట్ రైడర్స్
సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ, అంకుల్ రాయ్.. వీరిలో అందరికీ భారత మైదానాల మీద ఆడిన అనుభవం ఉంది. తమదైన రోజు వీరు వికెట్లను నేల కూల్చగలరు.. వీరిపై కోల్ కతా భారీ ఆశలు పెట్టుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్
కెప్టెన్ ధోని ఆధ్వర్యంలోని ఈ జట్టులో అద్భుతమైన స్పిన్ బౌలర్లు ఉన్నారు. జట్టు అవసరాలకు అనుగుణంగా ధోని బౌలర్లను వినియోగించుకుంటాడు. ఈ జట్టులో రవీంద్ర జడేజా, శాంట్నర్, రచీన్ రవీంద్ర, మొయిన్ అలీ, మహేశ తీక్షణ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. గత ఏడాది కీలక మ్యాచ్ లలో ఈ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అందువల్లే చెన్నై జట్టు విజేతగా నిలవగలిగింది.
రాజస్థాన్ రాయల్స్
ఈ జట్టులో కూడా ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, ఆడం జంపా, యజుర్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్.. వంటి బౌలర్లతో ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. గత సీజన్లో జంపా, చాహల్ మెరుగైన ప్రదర్శన చేశారు.