IPL 2024: ఎంత గొప్ప ఆటగాడయినా సొంత జట్టుకు అడుతుంటే అమితమైన కిక్ అనుభవిస్తాడు. అయితే ఐపీఎల్ లో కొంతమంది ఆటగాళ్లకు సొంత జట్టుకు ఆడాలనే కల ఇప్పటికీ కలగానే ఉంది. ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ..
టీమిండియా రన్ మిషన్ గా విరాట్ కోహ్లీకి పేరు ఉంది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో సచిన్ తర్వాత ఆ స్థాయిలో పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరిట ఉంది. అలాంటి అద్భుతమైన బ్యాటర్ 2008 నుంచి బెంగళూరు జట్టులో ఆడుతున్నాడు. అయితే అతడి సొంత రాష్ట్రం ఢిల్లీ. అయినప్పటికీ అతడిని కొనుగోలు చేసేందుకు ఆ జట్టు ఎప్పుడూ ప్రయత్నించలేదు. మరోవైపు తాను బెంగళూరుకు తప్ప మరో జట్టుకు ఆడబోనని విరాట్ ఎప్పుడో స్పష్టం చేశాడు.
దినేష్ కార్తీక్
చురుకైన వికెట్ కీపర్, తనదైన రోజు భారీ ఇన్నింగ్స్ ఆడే దినేష్ కార్తీక్.. సొంత రాష్ట్రం చెన్నై. ఇప్పటివరకు అతడు 6 జట్లు మారాడు. ముంబై, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, కోల్ కతా, బెంగళూరు జట్లలో ఆడాడు. కానీ ఇంతవరకు సొంత జట్టు చెన్నైకి ఆడ లేకపోయాడు. ఆ జట్టు కూడా దినేష్ కార్తీక్ ను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరపలేదు.
హర్భజన్ సింగ్
టీమిండియా వెటరన్ స్పిన్నర్. ముంబై జట్టు తరఫున సుదీర్ఘకాలం ఐపిఎల్ ఆడాడు. కోల్ కతా తరఫున కూడా ఆడాడు. అయితే హర్భజన్ సింగ్ సొంత రాష్ట్రమైన పంజాబ్ తరఫున ఇంతవరకు హర్భజన్ ఆడలేదు. ఇప్పుడు ఆడే అవకాశం కూడా లేదు..
శుభ్ మన్ గిల్
కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన గిల్.. ప్రస్తుతం గుజరాత్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గిల్ సొంత రాష్ట్రం పంజాబ్. కానీ ఇంతవరకు అతడు ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడలేదు.
బుమ్రా
ముంబై జట్టు తరఫున ఆడుతున్న బుమ్రా.. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టేముందు బరోడా తరఫున దేశ వాళి క్రికెట్ ఆడేవాడు. బుమ్రా సొంత రాష్ట్రం గుజరాత్. కానీ ఇంతవరకు ఆ జట్టు తరఫున ఆడే అవకాశం అతనికి లభించలేదు.