IPL 2024 RR vs DC : కొడితే సిక్స్ లేదంటే ఫోర్.. ఇదేం బ్యాటింగ్ స్వామి

చివరి ఓవర్ లో పరాగ్ పరుగుల సునామి సృష్టించాడు. అన్ రిచ్ నోర్టీజీ బౌలింగ్ లో 4, 4, 6, 4, 6, 1 బాదాడు. ఒకే ఓవర్ లో 25 పరుగులు పిండుకున్నాడు. దీంతో అప్పటిదాకా 160 పరుగుల వద్ద ఉన్న రాజస్థాన్ స్కోర్ ఒక్కసారిగా 185 పరుగులకు చేరుకుంది. అప్పటికి ఓవర్లు పూర్తయ్యాయి కాబట్టి.. ఢిల్లీ జట్టు ఊపిరి పీల్చుకుంది. లేకుంటే రాజస్థాన్ స్కోర్ డబుల్ డిజిట్ దాటేది. పరాగ్ సెంచరీ కూడా సాధించేవాడు.

Written By: NARESH, Updated On : March 28, 2024 10:41 pm

IPL 2024 RR vs DC : If you hit a six or a four.. Ryan Parag hit

Follow us on

IPL 2024 RR vs DC : ఐపీఎల్ 17వ సీజన్ అభిమానులకు అసలు సిసలైన టి 20 మజా అందిస్తోంది. బుధవారం హైదరాబాద్, ముంబై జట్లు అందించిన పరుగుల విందును మర్చిపోకముందే.. గురువారం ఢిల్లీ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు పరుగుల పీస్ట్ ను అందించింది. హైదరాబాద్ జట్టు చేసినంత భారీ స్కోర్ కాకపోయినప్పటికీ.. తమ జట్టు రేంజ్ లో పరుగులు చేసింది రాజస్థాన్ టీం.

టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. ఓపెనర్లు గా యశస్వి జైస్వాల్ (5), బట్లర్(11) క్రీజ్ లోకి దిగారు వీరిద్దరూ స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. 9 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు జైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సంజు సాంసన్ లక్నో జట్టుపై ఆడినట్టుగా ఆడ లేకపోయాడు.. అతడు కేవలం 15 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ అవుటయ్యాడు. బట్లర్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 11 పరుగులు మాత్రమే చేసిన అతడు కులదీప్ యాదవ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 36 పరుగులకే రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో రియాన్ పరాగ్ (84), రవిచంద్రన్ అశ్విన్ (29) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా పరాగ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 7 ఫోర్లు, 6 సిక్సర్లతో రాజస్థాన్ జట్టు బరువును వంటి చేత్తో మోసాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ 19 బంతుల్లో మూడు సిక్సర్ల సహాయంతో 29 పరుగులు చేశాడు. వీరిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్ కు 54 రన్స్ జోడించారు. రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయిన తర్వాత పరాగ్ మరింత రెచ్చిపోయాడు. జురెల్(20) తో కలిసి ఐదో వికెట్ కు 52 పరుగులు జోడించాడు. జురెల్ అవుట్ అయిన తర్వాత హిట్మేయర్(14 నాట్ అవుట్) తో కలిసి 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పరాగ్ చివరి వరకు నాట్ అవుట్ గానే ఉన్నాడు.

విధ్వంసానికి పరాకాష్ట