IPL 2024 MI vs GT: ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించి ఆడిన తొలి మ్యాచ్ గుజరాత్ జట్టు చేతిలో ముంబై జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి అనంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా గౌరవించకపోవడం.. ఫీల్డింగ్ విషయంలో పదేపదే బౌండరీ లైన్ వద్దకు పంపించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో హార్దిక్ పాండ్యా పై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు స్టేడియంలో హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. “హార్దిక్ పాండ్యా కు తల పొగరు బాగా పెరిగిందని” విమర్శలు చేశారు. ” హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు కెప్టెన్ గా పనికిరాడని” ఆరోపించారు. ఇది ఇలా ఉండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది.
ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు గుజరాత్ పై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి హార్దిక్ పాండ్యా నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ మైదానంలో హార్దిక్ అభిమానులపై దాడికి దిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. దీంతో హార్దిక్ అభిమానులు కూడా ప్రతిదాడికి దిగారని తెలుస్తోంది. దీంతో ఇరువురు క్రికెటర్లకు చెందిన అభిమానులు పరస్పరం దాడులు చేసుకున్నారట!. ఆ దాడులకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం గుజరాత్, ముంబై మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. దీనికంటే ముందు ముంబై జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా ప్రకటించింది.. అదే అప్పటినుంచి ముంబై మేనేజ్మెంట్ పై రోహిత్ అభిమానులు ఆగ్రహం గా ఉన్నారు.. రోహిత్ ను పక్కన పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎందుకు మార్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ముంబై జట్టును ఐదుసార్లు ఐపీఎల్ విజేతను చేసిన ఘనత రోహిత్ శర్మకు ఉందని, అలాంటప్పుడు అతడిని మార్చాల్సిన అవసరం ఏముందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆగ్రహాన్ని తగ్గించడానికి ముంబై జట్టు యాజమాన్యం రంగంలోకి దిగింది. కేవలం జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేసామని ప్రకటించింది. అయినప్పటికీ అభిమానుల్లో కోపం తగ్గడం లేదు.
ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లో అభిమానులు హార్దిక్, రోహిత్ వర్గాలుగా విడిపోయారు. ముఖ్యంగా రోహిత్ అభిమానులు ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మ్యాచ్ లో భాగంగా ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి హార్దిక్ పేరు ప్రస్తావించినప్పుడు రోహిత్ అభిమానులు గట్టిగా గోల చేశారు. “రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలంటూ” పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వారు చేస్తున్న నినాదాలతో స్టేడియం ఒక్కసారిగా మార్మోగిపోయింది. “ఇది ఆశ్చర్యంగా ఉంది. భారతదేశంలో ఆ దేశ క్రికెటర్ కు ఈ స్థాయిలో వ్యతిరేకత నేను ఎప్పుడూ చూడలేదని'” ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అన్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో చోటుచేసుకున్న వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.. ఈ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడి గుద్దులు గుద్దుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.. అంతేకాదు పలు మీడియా సంస్థలు రోహిత్, హార్దిక్ అభిమానులు కొట్టుకున్నారంటూ వార్తలను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. ముందుగా రోహిత్ అభిమానులు గొడవకు దిగారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్టేడియంలో కొట్టుకున్నది పాండ్యా, రోహిత్ అభిమానులు కాదని.. వారు వేరే వ్యక్తులని.. కొంతమంది వ్యక్తులు ఇలా పుకార్లు సృష్టిస్తున్నారని కొంతమంది అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో? అబద్ధం ఎంతో? పోలీసులు విచారణ నిర్వహించి అసలు విషయం చెప్పేదాకా.. ఈ వివాదంపై స్పష్టత వచ్చేది కష్టమే.
Rohit sharma fan got beaten️ by Hardik Pandya devotees in yesterday match.
Imagine what will happen if Rohit sharma himself came in front of us pic.twitter.com/M0MRxziH0Y
— Praneeth (@fantasy_d11) March 25, 2024