Homeక్రీడలుIPL 2024: మరీ ఇంత అహమా? కెప్టెన్ అయ్యాడో లేదో.. తలకు పొగరెక్కింది..

IPL 2024: మరీ ఇంత అహమా? కెప్టెన్ అయ్యాడో లేదో.. తలకు పొగరెక్కింది..

IPL 2024: నిన్నగాక మొన్న కెప్టెన్ అయ్యాడు. అది కూడా ట్రేడింగ్ పద్ధతిలో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చాడు. వచ్చిన వెంటనే అంతకుముందున్న కెప్టెన్ ను కలవలేదు. మాట వరసకు కూడా ఫోన్ చేయలేదు. తీరా మైదానంలోనూ పెద్దగా గౌరవం ఇవ్వలేదు. దీనికి తోడు అతడి సలహాలు తీసుకోలేదు. సూచనలు పాటించలేదు. ఎక్కడో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ పెట్టాడు. అంతేకాదు అటు ఇటు మార్చుతూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఇదంతా చూస్తున్న అభిమానులు కోపంతో ఊగిపోయారు. పట్టరాని ఆగ్రహంతో తిట్టడం మొదలుపెట్టారు. “పిల్ల బచ్చాగాడివి.. మాజీ కెప్టెన్ ను అలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావంటూ” విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా అహ్మదాబాద్ లో ముంబై జట్టు గుజరాత్ జట్టుతో ఆదివారం రాత్రి తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. సుదర్శన్ 45, గిల్ 31 పరుగులతో గుజరాత్ జట్టులో టాప్ స్కోరర్లు నిలిచారు. స్లాగ్ ఓవర్లలో రాహుల్ తెవాటియా 22 పరుగులు చేసి అలరించాడు. 169 పరుగుల విజయ లక్ష్యం ముంబై జట్టుకు పెద్ద లెక్కలోది కాదు. పైగా ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా భీకరంగా ఉంది. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 43, బ్రేవాస్ 46 మాత్రమే ఆ జట్టులో సత్తా చాటారు. మిగతా వారంతా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే పది పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జట్టుకు కీలకమైన సమయంలో సిక్స్, ఫోర్ కొట్టి పామ్ లో ఉన్నట్టు కనిపించిన అతడు.. తదుపరి బంతికి నిర్లక్ష్యపు షాట్ ఆడి క్యాచ్ అవుట్ అయ్యాడు. చివరి ఓవర్ లో 19 పరుగులు అవసరమైనచోట.. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో సిక్స్, ఫోర్ కొట్టిన హార్దిక్.. తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడు. అతడు క్యాచ్ అవుట్ అవ్వడంతో గుజరాత్ జట్టు వైపు ఒక్కసారిగా మ్యాచ్ మళ్ళింది.

అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోని హార్దిక్ పాండ్యా.. ఈ మ్యాచ్ ద్వారా మాత్రం ప్రేక్షకుల విమర్శలను భారీగా మూట కట్టుకున్నాడు. మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ను పాండ్యా తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. స్లిప్పు లేదా యార్డ్ సర్కిల్, మిడ్ ఆఫ్ వంటి ప్రాంతాలలో మాత్రమే రోహిత్ శర్మ ఇప్పటివరకు ఫీల్డింగ్ చేశాడు. తన కెరియర్ ప్రారంభంలో తప్పితే ఇంతవరకు రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసిన దాఖలాలు లేవు. మాజీ కెప్టెన్ అనే గౌరవం లేకుండా హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ గా ఉంచాడు. అది కూడా కుదురుగా ఉండనీయకుండా అటూ ఇటూ మార్చాడు. దీంతో రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేసుకుంటూనే బౌండరీ లైన్ వద్దకు వెళ్లాడు.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.”ఆట మీద దృష్టి పెట్టకపోవడం వల్ల గుజరాత్ పై ముంబై ఓడిపోయింది. అనామకుడిని తీసుకొచ్చి అవకాశాలు కల్పిస్తే ఇలా చివరికి అవమానిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కు కళ్ళు నెత్తికెక్కాయి. అందుకే ఇలా వ్యవహరిస్తున్నాడు. అతడు మహేంద్ర సింగ్ ధోని, రుతు రాజ్ గైక్వాడ్ ను చూసి నేర్చుకోవాలి. ఇంతటి అవమానాన్ని ఎదుర్కొంటున్న రోహిత్ ఆ జట్టులో అసలు ఉండకూడదు. ఐపీఎల్ ఉన్నంతవరకే హార్దిక ఆటలు. ఆ తర్వాత అతడు రోహిత్ కెప్టెన్సీ కిందే ఆడాల్సి ఉంటుంది. అప్పుడు హార్దిక్ ఉంటుంది భయ్యో” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular