IPL 2024: కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు.. ఎంఎస్ ధోనితో సమం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోని పేరు మీద రికార్డు ఉండేది. ఆ రికార్డును ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా లక్నో కెప్టెన్ రాహుల్ సమం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 58 పరుగులు చేసిన రాహుల్.. ఈ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 26, 2024 11:47 am

IPL 2024

Follow us on

IPL 2024: ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో సెంచరీలు నమోదు కాకపోయినప్పటికీ.. ఆటగాళ్లు బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. దూకుడుకు అసలు సిసలైన పర్యాయపదంగా నిలుస్తున్నారు. అందులో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరుదైన ఘనత అందుకొని దిగ్గజ క్రికెటర్ సరసన నిలిచాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోని పేరు మీద రికార్డు ఉండేది. ఆ రికార్డును ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా లక్నో కెప్టెన్ రాహుల్ సమం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 58 పరుగులు చేసిన రాహుల్.. ఈ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.

మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు ఐపీఎల్ లో 24 సార్లు 50 కి పైగా పరుగులు చేశాడు. రాహుల్ కూడా 24 సార్లు 50 కి మించి పరుగులు సాధించాడు. అయితే ఈ సీజన్లో రాహుల్ మహేంద్రసింగ్ ధోని అధిగమించే అవకాశం కల్పిస్తోంది. వీరి తర్వాత స్థానాల్లో క్వింటన్ డికాక్ (22), దినేష్ కార్తీక్ (19) ఉన్నారు. ఇక ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లోనే లక్నో రాజస్థాన్ పై ఓటమిని చవిచూసింది.

జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై లక్నో 20 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. సంజు ఆధ్వర్యంలోని రాజస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 1073 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ కే ఎల్ రాహుల్ 58, పూరన్ 64 రాణించినప్పటికీ లక్నో జట్టు విజయం సాధించలేకపోయింది. ఇక లక్నో జట్టు తన తదుపరి మ్యాచ్ మార్చి 30న పంజాబ్ జట్టుతో ఆడుతుంది. తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైన నేపథ్యంలో లక్నో జట్టు కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.