CSK vs GT, IPL 2024: చెన్నైని ఓడించి గుజరాత్ రివెంజ్ తీర్చుకుంటుందా..? ఈరోజు మ్యాచ్ లో గెలుపెవరిదంటే..?

ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ టీంలో విధ్వంసకర బ్యాట్స్ మెన్ అయిన డేవిడ్ మిల్లర్ కి సీఎస్కే పై మంచి రికార్డు ఉంది. సీఎస్కే టీమ్ అంటేనే మిల్లర్ భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగిపోతాడు.

Written By: Gopi, Updated On : March 26, 2024 11:44 am

Who will win Chennai vs Gujarat match

Follow us on

CSK vs GT, IPL 2024: ఐపిఎల్ లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ టీమ్ ల మధ్య ఒక భారీ మ్యాచ్ జరగనుంది. గత సంవత్సరం ఫైనల్ లో తల పడిన ఈ టీమ్ లు ఈసారి ఎవరి సత్తా ఏంటి అనేది తేల్చుకోవడానికి రెఢీ అవుతున్నాయి… ఇక గత ఫైనల్ మ్యాచ్ లో రెండు జట్లూ హోరాహోరీగా తలపడి చివరి బంతి దాకా సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ, సాగిన ఆ మ్యాచ్ లో జడేజా లాస్ట్ బాల్ కి బౌండరీ కొట్టి సీఎస్కే కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక చెన్నై టీమ్ ఐదోవసారి కప్పు గెలవడం లో జడేజా కీలకపాత్ర వహించాడు. ఇక ఇది ఇలా ఉంటే గత ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఘోరమైన ఓటమిని చవిచూసిన గుజరాత్ ఈ మ్యాచ్ లో చెన్నై ని ఓడించి రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ టీంలో విధ్వంసకర బ్యాట్స్ మెన్ అయిన డేవిడ్ మిల్లర్ కి సీఎస్కే పై మంచి రికార్డు ఉంది. సీఎస్కే టీమ్ అంటేనే మిల్లర్ భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగిపోతాడు. ఇక ఇలాంటి క్రమం లో చెన్నై టీమ్ బౌలర్లు డేవిడ్ మిల్లర్ ను ఆదిలోనే కట్టడిచేయాలి లేకపోతే మాత్రం గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియం లో జరిగనుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై తన హోమ్ గ్రౌండ్ లో ఆడిన మ్యాచ్ ల్లో చాలా మంది రికార్డ్ ఉంది. ఇక చెన్నై టీం కి తన హోమ్ గ్రౌండ్లు అంటే కంచుకోట లాంటివనే చెప్పాలి. ఇక్కడ చెన్నై టీం ని ఓడించడం అనేది కత్తి మీద సాము లాంటిది. గుజరాత్ టీం కెప్టెన్ గిల్ కి చెన్నై టీం పై అంత పెద్ద రికార్డు అయితే లేదు. గిల్ ఇప్పటివరకు చెన్నైతో ఆడిన మ్యాచ్ ల్లో దీపక్ చాహర్ బౌలింగ్ లోనే మూడుసార్లు అవుట్ అయ్యాడు.

జడేజా మరియు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో రెండుసార్లు అవుట్ అయ్యాడు. కాబట్టి గిల్ ఈ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక ఈ మ్యాచ్ లో మతిషా పతి రానా సీఎస్కే టీం కి అందుబాటులో ఉంటాడు. ఆర్సిబి తో ఆడిన మ్యాచ్ లో పతిరానా అందుబాటులో లేకపోవడం వల్ల ‘ముస్తఫిజర్ రెహ్మాన్’ ను ఆడించారు. ఆ మ్యాచ్ లో ముస్తఫిజర్ అద్భుతమైన బౌలింగ్ తో కీలకమైన నాలుగు వికెట్ పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఇప్పుడు ముస్తఫిజర్ ను పక్కన పెట్టి పతిరానను తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు.

సాధారణంగా సీఎస్కే టీం విన్నింగ్ టీమ్ లో నుంచి మార్పులు చేయడానికి పెద్దగా ఇష్టపడదు. ఈ రెండు టీంలు బౌలింగ్ ,బ్యాటింగ్, ఫీల్డింగ్ లో చాలా పటిష్టంగా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమం లో సీఎస్కే ని ఎలాగైనా ఓడించి తన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్న గుజరాత్ కల నెరవేరుతుందేమో చూడాలి. ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు గుజరాత్ కి 40% ఉండగా, చెన్నై కి మాత్రం 60% ఉంది. ఇక ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్ లో ఏ టీం విజయం సాధిస్తుందో చూడాలి…