https://oktelugu.com/

IPL 2024: ఐపీఎల్ టికెట్లు పొందిన అభిమానులకు బంపర్ ఆఫర్లు

ధోని పక్కకు తప్పుకోవడంతో ఈసారి చెన్నై జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ సారధ్య బాధ్యతలు వహించనున్నాడు. గత సీజన్లో ధోని ఆధ్వర్యంలో చెన్నై జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా చెన్నై జట్టును విజేతగా నిలిపి ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు.

Written By: , Updated On : March 22, 2024 / 08:42 AM IST
IPL 2024

IPL 2024

Follow us on

IPL 2024: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian premier league) 17వ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలోని చేపాక్కం లోని చిదంబరం మైదానం లో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai super kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (royal challengers Bengaluru) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. రాత్రి ఆరు గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభ వేడుకలు మొదలవుతాయి.

కొత్త కెప్టెన్

ధోని పక్కకు తప్పుకోవడంతో ఈసారి చెన్నై జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ సారధ్య బాధ్యతలు వహించనున్నాడు. గత సీజన్లో ధోని ఆధ్వర్యంలో చెన్నై జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా చెన్నై జట్టును విజేతగా నిలిపి ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా గురువారం చెన్నై జట్టు యాజమాన్యం కెప్టెన్ ను మార్చడం విశేషం.

తొలి మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐ టికెట్ విక్రయాలను ఈనెల 18 నుంచే ప్రారంభించింది. ప్రారంభించిన పది నిమిషాల్లోనే టికెట్లు మొత్తం అయిపోయాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ప్రారంభ మ్యాచ్ కోసం ఈ మైదానాన్ని బీసీసీఐ సరి కొత్తగా ముస్తాబు చేసింది. మైదానం చుట్టూ చెన్నై ఆటగాళ్ల చిత్రాలు రూపొందించింది. స్టేడియం మొత్తం పసుపు రంగుతో నిండిపోయింది. ఇక ఇరుజట్ల ఆటగాళ్లు గురువారం సాయంత్రమే చెన్నై చేరుకున్నారు. మైదానంలో సందడి చేయడానికి అభిమానులు తమకిష్టమైన జట్ల జెర్సీలను కొనుగోలు చేసేందుకు స్పోర్ట్స్ దుకాణాలకు పోటెత్తారు.

ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో అభిమానులకు గుడ్ న్యూస్. మ్యాచ్ టికెట్లు పొందిన అభిమానులు మెట్రో రైలు, ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయా సంస్థలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం అభిమానులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంటీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. చింతాద్రిపేట నుంచి వేళచ్చేరి వరకు ప్రత్యేక సబర్బన్ రైలు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.ఇక మ్యాచ్ జరుగుతున్న మైదానం చుట్టూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.