Arvind Kejriwal And Hemant Soren: అవినీతి, అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఒకవైపు సోదాలు కొనసాగిస్తూనే.. మరోవైపు అరెస్టులు చేస్తోంది. తాజాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలని 9సార్లు నోటీసులు ఇచ్చింది. కారణాలు చెప్పకుండా విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట లభింలేదు. దీంతో 8 మంది సభ్యుల ఈడీ బృందం గురువారం(మార్చి 21న) ఢిల్లీ సీఎం ఇంటికి వెళ్లింది. సోదాల అనంతరం ఫోన్లు సీజ్ చేసి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.
రెండు నెలల క్రితం జార్ఖండ్ సీఎం..
ఇదిలా ఉంటే ఈడీ రెండు నెలల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్టు చేసింది. జనవరి 30న బొగ్గు కుంభకోణం కేసులో ఈడీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. ఏడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంతో ఈడీ అదుపులోకి తీసుకుంది. దీంతో శాసనసభాపక్ష నేతగా మంత్రి చంపై సోరె¯Œ ను ఎన్నుకున్నారు. అనతరం హేమంత్ సోరేన్ పదవికి రాపీనామా చేశారు.
తాజాగా ఢిల్లీ జీఎం..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. కోర్టు అరెస్టుపై స్టేకు నిరాకరించడంతో ఈడీ అధికారులు సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. సోదాలు నిర్వహించారు. రెండున్నర గంటలపాటు విచారణ చేశారు. అనంతరం అరెస్టు చేశారు.
వారం క్రితం కవిత..
ఇక వారం క్రితం ఢిల్లీ లిక్కర్ కేసులోనే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్‌ఎమ్మెల్సీకల్వకుంట్ల కవితను అరెస్టు చేసింది. అనంతరం 10 రోజుల కస్టడీ కోరగా రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఒకవైపు కవిత కస్టడీ కొనసాగుతుండగానే, ఈడీ ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకుంది.
ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం..
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 9 మంది అరెస్టు అయ్యారు. వారం క్రితం కవిత, తాజాగా అర్వింద్ కేజ్రీవాల్‌లో ఆ సంఖ్య 11కు చేరింది. ఈ కేసులు ఇప్పటి వరకు అరెస్టు అయిన వారిలో చాలామంది అప్రూవల్‌గా మారి బయటకు వచ్చారు. సౌత్ గ్రూప్‌ను లీడ్ చేసిన కవిత, స్కాం డీల్ చేసిన కేజ్రీవాల్ చివరకు అరెస్టు అయ్యారు. వీరిద్దరినీ కలిపి ఈడీ విచారణ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం కేజ్రీవాల్‌ను 9 రోజుల కస్టడీ కోరాలని ఈడీ భావిస్తోంది. మరోవైపు మార్చి 23తో కవిత కస్టడీ ముగుస్తుంది. దీంతో ఆమె కస్టడీని కూడా పొడిగించాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.