IPL 2023: ఐపీఎల్ తుదిఅంచెకు చేరింది. మంగళవారం చెన్నై చేపాక్ స్టేడియంలో జరిగిన కీలకమైన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దర్జాగా అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు దాదాపు వెళ్ళిపోయింది.. అయితే శుక్రవారం మరో క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే ఈ ఎడిషన్ మాత్రమే కాకుండా ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి చెన్నై టీం విజయవంతమైన జట్టుగా ముద్ర వేసుకుంది. నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడిన చెన్నై జట్టు.. అత్యధిక సార్లు ప్లే ఆఫ్ దశకు వెళ్లిన జట్టుగా ముద్ర వేసుకుంది. క్వాలిఫైయర్ _1 లో గుజరాత్ పై 15 పరుగుల తేడాతో చెన్నై జట్టు విజయం సాధించింది. చెన్నైకి చెందిన ప్రాంచైజీ ఐపీఎల్ లో అత్యధికంగా ఫైనల్స్ లో(9సార్లు) అది నా జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. 2020, 2022 సీజన్ లో చెన్నై జట్టు అత్యంత పెలవమైన ప్రదర్శన కనబరిచింది. ఆ సంవత్సరంలో 7, 9 స్థానాల్లో నిలిచింది. ఈ ఎడిషన్ ల పోటీలు తటస్థ వేదికల్లో జరిగాయి. 2020 ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది. 2022 లీగ్ స్థాయి మ్యాచులు మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో జరిగాయి.
ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు 223 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా.. 129 గెలిచింది. అయితే ఈ రికార్డును గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జేయింట్ జట్లు మాత్రమే తిరగ రాయగలిగాయి. 2011లో ఐపీఎల్ ప్లే ఆఫ్ లను ప్రవేశపెట్టినప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ 19 మ్యాచ్ లలో 12 విజయాలు సాధించింది. గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో విజయం సాధించి చెన్నై జట్టు తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఇక క్వాలిఫైయర్_1 మ్యాచ్ లలో చెన్నై జట్టు ఏడు మ్యాచ్లు ఆడగా… ఐదు గెలిచింది. చెన్నైలో జరిగిన 5 ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడింటిలో విజయం సాధించింది.
2011
క్వాలిఫైయర్ _1 మ్యాచ్లో ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు బెంగళూరు జట్టును ఆరు వికెట్ల తేటలతో ఓడించింది. ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టును చెన్నైలోని చిదంబరం స్టేడియంలో 58 పరులు తేడాతో చెన్నై జట్టు ఓడించింది.
2012
ఎలిమినేటర్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించింది.
క్వాలిఫైయర్_2: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 86 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును ఓడించింది. ఈ సీజన్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై జట్టును కోల్ కతా నైట్ రైడర్స్ ఓడించింది.
2013
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన క్వాలిఫైయర్_1 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 48 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఈ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై జట్టు చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2014
ఎలిమినేటర్: ముంబైలోని బ్ర బౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.
క్వాలిఫైయర్: 2 ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు చేతులో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2015
క్వాలిఫైయర్ 1: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.
క్వాలిఫైయర్ 2: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2018
క్వాలిఫైయర్ 1: ముంబైలోని వాంకటే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. చెన్నై జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పైనల్: వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు హైదరాబాద్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది.
2019
క్వాలిఫైయర్ 1: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
క్వాలిఫైయర్ 2: విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది.
ఫైనల్: హైదరాబాదులో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెన్నై జట్టు ముంబై జట్టు చేతిలో ఒక్క పరుగు తేడాతో కప్ చేజార్చుకుంది.
2021
క్వాలిఫైయర్1: దుబాయిలో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది.
ఫైనల్: దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో కోల్కతా జట్టును ఓడించింది.
2023
క్వాలిఫైయర్ 1: చెన్నైలోనే చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం చెన్నై మాత్రమే కాకుండా ముంబాయి జట్టు కూడా పదిసార్లు ప్లే ఆఫ్ దశకు వెళ్లి రెండవ స్థానంలో నిలిచింది.