Chaitanya Master Mother: ‘ఢీ’ డ్యాన్సర్ చైతన్య మరణం టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపినట్లయింది. బెస్ట్ డ్యాన్సర్ గా ఎదిగిన చైతన్య ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. తాను అప్పుల పాలయ్యాననే మనో వేదనకు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో బయటకు రావడంతో అసలు ఢీ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది? అని అనుకుంటున్నారు. ఢీ ప్రోగ్రాం ద్వారా తనకు వస్తాయనుకున్న డబ్బులు రాలేదని, అందువల్లే సూసైడ్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తల్లి లక్ష్మీరాయ్ కూడా స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఈటీవీలో ప్రసారమ్యే ఢీ ప్రోగ్రాం ఎప్పూడూ హాట్ హాట్ గా సాగుతుంది. ఎముకలన్నీ కుప్ప పోసినట్లు కొందరి డ్యాన్స్ చూస్తే మతిపోతుంది. కొందరి పర్ఫామెన్స్ ను చూసి అక్కడున్న జడ్జిలే షాక్ అవుతారు. డ్యాన్స్ లో టాలెంట్ ఉంటే డీలో రాణిస్తారని చాలా మంది అభిప్రాయం. అలా కొందరు సక్సెస్ అయ్యారు కూడా. అయితే ఢీ ప్రొగ్రాంలో పార్టిసిపేట్ చేసే కొన్ని టీమ్స్ మధ్య పోటీలు పెడుతూ ఉంటారు. ఇలా ఫైనల్ కు వెళ్లిన వారికి బెస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అయితే మిగతా వారికి మాత్రం నామమాత్రపు ఫీజు ఇస్తారని కొందరు చెబుతున్నారు.
చైతన్య విషయానికొస్తే ఆయన ఫైనల్ కు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాడు. తమ టీం మెంబర్స్ ను అలర్ట్ చేశాడు. ఈ క్రమంలో కొన్ని ఖర్చులు ఏర్పడ్డాయి. అలా మూడున్నర లక్షలు అవసరం పడ్డాయి. ఈవిషయాన్ని ఇంట్లో చెప్పడం ద్వారా ముందుగా తండ్రి వద్దని చెప్పాడు. దీంతో చైతన్య ఒకరోజంతా అలిగి కూర్చున్నాడు. చివరికి ఎలాగోలా చైతన్య తండ్రి ఆ డబ్బులను తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే తాను అనుకున్నట్లు ఫైనల్ వరకు వెళ్లినా విన్ కాలేదు. ఇలా రెండు సార్లు ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయాడు.
దీంతో తీవ్ర నిరాశ చెందిన చైతన్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు ఢీ షో లో రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తున్నారంటూ వార్తలు పెట్టారు. వాస్తవానికి డ్యాన్స్ ప్రోగ్రాం కోసం కొందరు పర్సనల్ గా ఖర్చు పెట్టుకుంటారు. గెలుపొందితే వారికి బెస్ట్ ప్రైజ్ వస్తుంది. అయితే తన కుమారుడు కేవలం మూడు లక్షల కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందని కన్నీరుపెట్టారు. చైతన్యకు ‘ఢీ’ తోనే గుర్తింపు వచ్చిందని, కానీ ఢీ లో గెలుపొందడం కోసం ఇంత పనిచేస్తాడని అనుకోలేదని అంటున్నారు.