IPL 2023 Final : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు ఎన్నో ఆశలతో వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. అయితే, మ్యాచ్ జరగడానికి కొద్దిగా గంటల ముందు నుంచి ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షం పడతోంది. దీంతో మ్యాచ్ ఇప్పటికి ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ అసలు ప్రారంభమవుతుందో లేదో అన్న అనుమానం అభిమానులను వేధిస్తోంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే ఎవరిని విజేతగా ప్రకటిస్తారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈయన పద్యంలో మ్యాచ్ రద్దు అయితే, సూపర్ ఓవర్ నిర్వహించేందుకు అవకాశం కూడా లేకపోతే ఎవరు విజేతగా నిర్ణయిస్తారన్న దానిపై ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం మీరు చదివేయండి.
ఐపీఎల్ ఈ ఏడాది అభిమానులను ఎంతగానో ఊర్రూతలూగించింది. రెండు నెలలపాటు అభిమానులను అలరించిన ఈ టోర్నమెంట్ ముగింపు దశకు వచ్చింది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య హోరాహోరీగా జరగాల్సి ఉంది. అయితే, వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి ఆలస్యమైంది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచి మరోసారి టైటిల్ ఎగురేసుకుపోవాలని గుజరాత్ టైటాన్స్ జట్టు చూస్తోంది. ధోని నాయకత్వం లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి కప్ కొట్టి ముంబై ఇండియన్స్ ను సమం చేయాలని చూస్తోంది చెన్నై జట్టు. అయితే, ఈ రెండు జట్లను మరింత అసహనానికి గురి చేసేలా మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం వల్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే ఏం జరుగుతుందో అన్నదానిపై అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు.
వర్షంతో మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే ఉంటుందా..?
వర్షం వల్ల ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే ఉంటుంది. మ్యాచ్ విషయంలో కట్ ఆఫ్ సమయం రాత్రి 9:35 గంటలు. ఈ సమయం దాటితే ఓవర్లు గురించబడతాయి. ఈ సమయం దాటిన ప్రతి ఐదు నిమిషాలకు కొన్ని ఓవర్లు చొప్పున కుదిస్తారు. ఒకవేళ వర్షం వల్ల అర్థ రాత్రి వరకు మ్యాచ్ ఆడించడం సాధ్యం కాకపోతే మరో నిబంధన ప్రకారం ముందుకు వెళతారు. అంటే రాత్రి 12 గంటలు దాటితే అంటే సోమవారం ఉదయం అవుతుంది. సోమవారం ఉదయం 12:06 గంటలు సమయంలో మ్యాచ్ ఆడేందుకు అవకాశం వస్తే ఐదు ఓవర్ల గేమ్ నిర్వహించేందుకు కట్ ఆఫ్ అవకాశం ఉంది.
సూపర్ ఓవర్ కు కట్ ఆఫ్ ఎంత..?
ఒకవేళ మరి ఆలస్యమైతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు ఐపీఎల్ నిబంధనలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ రోజుకు అవకాశం లేకపోతే, ఐదు ఓవర్ల మ్యాచ్ ఆడించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లయితే సూపర్ ఓవర్ ప్రకారం విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. సూపర్ ఓవర్ లో గెలిచిన జట్టును విజేతగా నిర్ణయిస్తారు.
సూపర్ ఓవర్ నిర్వహించకపోతే ఎవరు గెలుస్తారు..?
ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ కూడా నిర్వహించేందుకు అవకాశం లేకపోతే మరో నిబంధన ప్రకారం విజేతను ప్రకటిస్తారు. ఈ నిబంధన గుజరాత్ జట్టుకు మేలు చేకూర్చే విధంగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో పోలిస్తే గ్రూపు దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గుజరాత్ టైటాన్స్ ను టైటిల్ వరిస్తుంది. ఈ మేరకు ఐపీఎల్ నిబంధనలు చెబుతున్నాయి. ఐపీఎల్ నిబంధనల్లోని పేరా గ్రాఫ్ 8, 9 లో వివరించిన విధంగా సూపర్ ఓవర్ ను ప్రారంభించడంగాని, అంతరాయం లేకుండా సూపర్ పూర్తి చేయడంగాని సాధ్యం కాకపోతే లీగ్ అసలు 70 మ్యాచ్ల తరువాత పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంతో మిగించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ నిబంధన ప్రకారం చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ జట్టుకు అవకాశం కనిపిస్తోంది. అయితే, ఆదివారం మ్యాచ్ ఆడించే అవకాశం లేకపోతే రిజర్వ్ డేకు ఐపీఎల్ యాజమాన్యం వెళ్లే అవకాశం కనిపిస్తోంది.