https://oktelugu.com/

IPL 2022 Full Schedule: ఐపీఎల్ 2022 షెడ్యూల్ ఇదీ.. పాత ఫైనలిస్టుల మధ్య తొలి పోటీ

IPL 2022 Full Schedule: వివో నుంచి టాటా స్పాన్సర్ షిప్ కు మారాక ఐపీఎల్ ఆడే మ్యాచుల్లోనూ మార్పులు చోటుచేసుకుంది. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్తగా ముస్తాబైంది.ఈ మేరకు 15వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభమవుతాయి. ముంబై, ఫూణే నగరాల్లోని నాలుగు మైదానాల్లో దాదాపు 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్ లు, నాలుగు ప్లే ఆఫ్స్ జరుగుతాయని బీసీసీఐ షెడ్యూల్ […]

Written By: , Updated On : March 6, 2022 / 07:44 PM IST
Follow us on

IPL 2022 Full Schedule: వివో నుంచి టాటా స్పాన్సర్ షిప్ కు మారాక ఐపీఎల్ ఆడే మ్యాచుల్లోనూ మార్పులు చోటుచేసుకుంది. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్తగా ముస్తాబైంది.ఈ మేరకు 15వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభమవుతాయి. ముంబై, ఫూణే నగరాల్లోని నాలుగు మైదానాల్లో దాదాపు 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్ లు, నాలుగు ప్లే ఆఫ్స్ జరుగుతాయని బీసీసీఐ షెడ్యూల్ చేసింది.

ఇక గత ఐపీఎల్ ఫైనిలిస్టులు అయిన చెన్నై, కోల్ కతా మధ్యనే తొలి మ్యాచ్ జరుగుతుంది. వాంఖడే స్టేడియం వేదికగా మార్చి 26న శనివారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సీజన్ లో ఈ రెండు జట్లు ఫైనల్ కు వచ్చాయి. కేకేఆర్ పై సీఎస్ కే విజయం సాధించి కప్ కొట్టింది.

ఐపీఎల్ ఇదివరకటిలాగా జరగదు. మొత్తం 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడుతుంది. మార్చి 27 నుంచి రోజుకు రెండు మ్యాచ్ లు జరుపుతూ బీసీసీఐ షెడ్యూల్ చేసింది.

మార్చి 29న ఫూణేలో మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతాయి.