IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పండుగ వేళకు ఆటగాళ్ల వేలం బెంగుళూరులో జరిగింది. అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల కోసం రూ. కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. కానీ హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం టాలెంట్ ఉన్న వారందరిని వదిలేసి ఎందుకు పనికి రాని వారిని ఎంచుకుంది. దీంతో విమర్శలు మూటగట్టుకుంది. మొదట వచ్చిన ఆటగాళ్లందరిని కాదని చివర్లో పనికిమాలిన వారిని తీసుకుని అందరిలో అనుమానాలు నింపింది.
ప్రతిభ లేని వారిని తీసుకుని జట్టును బలహీనంగా చేసింది. దీంతో ఫ్రాంచైజీ తీరుకు అన్ని దారుల్లో విమర్శలు ఎదుర్కొంటోంది. రూ.69 కోట్లు ఖర్చు చేసి 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసినా అందులో పనికొచ్చే వారు మాత్రం లేకపోవడం గమనార్హం. దీంతో జట్టు కూర్పు అధ్వానంగా మారింది. వచ్చే మ్యాచుల్లో ప్రభావం చూపడం అనుమానంగానే తోస్తుంది.
Also Read: వార్నర్‌ను వదిలేసిన సన్ రైజర్స్.. నెట్టింట ట్రోల్స్‌తో రెచ్చిపోతున్న క్రికెట్ లవర్స్..!
మొదట ఏ ఆటగాడి కోసం కూడా బిడ్ వేయలేదు. దీంతో మంచి ఆటగాళ్లందరు అమ్ముడుపోయాక పనికి రాని వారి కోసం కూడా భారీగానే డబ్బులు చెల్లించి కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆటను మలుపు తిప్పే వారి కోసం డబ్బులు చెల్లించకుండా బలహీనంగా ఉన్న వారిని తీసుకుని ఎలా ముందుకు వెళ్తుందో తెలియడం లేదు. దీంతో అభిమానుల్లో నిరాశే ఎదురవుతోంది.
హైదరాబాద్ సన్ రైజర్స్ తీరు మొదటి నుంచి విమర్శలకు కేంద్ర బిందువుగా మారడం తెలిసిందే. దీంతో ఆటగాళ్ల ఎంపికలో కూడా ఇలా వ్యవహరించడం ఆందోళనకు తావిస్తోంది. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి కుంటి గుర్రాలను వేలంలో దక్కించుకోవడం సాహసమే. నిర్వాహకుల తీరుకు అందరిలో అనుమానాలు వస్తున్నాయి. నికోలస్ పూరన్ కు రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
మరోవైపు గాయాలతో బాధపడుతున్న భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లను మళ్లీ కొనుగోలు చేసి ఘనకార్యమే చేసింది. కానీ వచ్చే ఐపీఎల్ మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపని ఆటగాళ్లను తీసుకుని ఇంకా వెనుకబడిపోయినట్లు తెలుస్తోంది.
కేన్ విలియమ్స్ (14 కోట్లు), అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (7.5 కోట్లు), నికోలస్ పూరన్ (10.75 కోట్లు) నటరాజన్ (4 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (4.2 కోట్లు), ప్రియామ్ గార్గ్ (20 లక్షలు), రాహుల్ త్రిపాఠి (8.5 కోట్లు), అభిషేక్ వర్మ (6.5 కోట్లు), కార్తీక్ త్యాగ్ (4 కోట్లు), జగదీష్ సుచిత్ (20 లక్షలు)లను తీసుకుంది.
Also Read: అభినందన్ వ్యవహారంలో కొత్త కోణం