IPL 2021: ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. చివరి వారంలో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. నిన్న జరిగిన బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. బెంగళూరు ఈజీగా గెలుస్తుందనుకుంటున్న సమయంలో హైదరాబాద్ బౌలర్ల ధాటికి బెంగళూరు పరుగులు చేయలేక 4 పరుగులతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్ కు నేరుగా అర్హత పొందింది. కానీ వారి కలను హైదరాబాద్ నిలువరించింది. ఇప్పుడు వేరే టీంల జయాపజయాల ఆధారంగా బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరనుంది.
ప్రస్తుతానికి ప్లే ఆఫ్ రేసులో బెంగళూరు ఉంది. మొత్తం మ్యాచ్ లు పూర్తయ్యాకనే బెంగళూరు సెమీస్ చేరుతుంది. ఆఖరి ప్లే ఆఫ్ రేసులో ప్రస్తుతం కోల్ కతాతోపాటు ముంబై ఉంది. ఈరోజు రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో కోల్ కతా తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు వెళుతుంది. ఓడితే మాత్రం ముంబై కి చాన్స్ ఉంది. ముంబై చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై గెలిస్తేనే వెళుతుంది. లేదంటే ఇంటి దారి పడుతుంది.
ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు కప్ కొట్టిన ముంబై ఈసారి ఆపసోపాలు పడుతోంది. ముంబై ప్రధాన ఆటగాళ్లు అయిన రోహిత్, హార్ధిక్, కృనాల్, ఇషాన్, సూర్యకుమార్, పోలార్డ్ లు ఫాంలో లేక ఆ జట్టు వరుసగా ఓడి దూరంలో నిలిచింది. ఎప్పుడూ టాప్ లో ఉండే ముంబై ఈసారి మిగిలినఏకైక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఘన విజయం సాధిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరే చాన్స్ ఉంటుంది. లేదంటే ఇంటిదారి పట్టడం ఖాయం..
ఇక కోల్ కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం 13 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ ముంబై కంటే బాగుంది. సో వీళ్లు చివరి మ్యాచ్ లో రాజస్థాన్ పై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందరికంటే ఎక్కువగా కోల్ కతానే ప్లే ఆఫ్స్ చాన్సులున్నాయి. 12 పాయింట్లతో సమంగా ఉన్న ముంబై , కోల్ కతాకు ప్లే ఆఫ్ అవకాశాలున్నాయి. వీటిలో నెట్ రన్ రేట్ బాగా ఉన్న కోల్ కతా మరింత మెరుగ్గా ఉంది.
ఇక మిగిలిన రెండు బెర్త్ లు రాజస్థాన్ , పంజాబ్ లకు అవకాశాలున్నాయి. కానీ కేకేఆర్, ముంబై జట్లు వారి తదుపరి మ్యాచ్ లలో ఓడిపోతే ఈ రెండింటికి చాన్స్ ఉంది. సో ఎలా చూసినా ఈ నాలుగు జట్లలో కోల్ కతాకు ఫస్ట్ చాన్స్, ముంబైకి సెకండ్ చాన్స్ ఉంది. మిగిలిన పంజాబ్, రాజస్థాన్ అదృష్టంపై ఆధారపడి ఉన్నాయి.