Prabhas SPIRIT: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండగానే ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ తన 25వ చిత్రంగా నటించబోయే సినిమాకు సంబంధించిన విషయాలను నేడు తెలియజేశారు.

ప్రభాస్ ఇదివరకు ఎప్పుడు నటించని పాత్రలో ఈ సినిమాలో సందడి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రభాస్ సలార్, ఆది పురుష్, రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ చిత్రాలతో బిజీగా ఉండగా తన 25వ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను నేడు అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్ 25వ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా “స్పిరిట్” అనే సినిమాను తెరకెక్కించబోతున్నట్టు నేడు సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ తన 25వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.