https://oktelugu.com/

Deepak Chahar: మైదానంలోనే టీమిండియా క్రికెటర్ లవ్ ప్రపోజల్.. ఏమైందంటే.. వైరల్ వీడియో

Deepak Chahar love proposal: ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు.. ‘చూపులు కలిసిన శుభవేళ ఎందుకీ మీకీ కలవరం’ అంటూ మన రచయితలు చూడచక్కని భావాలతో పాటలు కూడా రాశారు. ఇప్పుడు అలాంటి అనుకోని సంఘటనే ఐపీఎల్ లో చోటుచేసుకుంది. ఓ ప్రేమ చిగురించింది. టీమిండియా క్రికెటర్ ను ఓ ఇంటివాడిని చేయబోతోంది. చెన్నైసూపర్ కింగ్స్ ఆల్ రౌండర్, టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ మైదానంలో ఓ యువతిని చూసి ప్రేమలో పడ్డాడు. చుట్టూ కెమెరాలు ఉండగానే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2021 / 09:20 AM IST
    Follow us on

    Deepak Chahar love proposal: ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు.. ‘చూపులు కలిసిన శుభవేళ ఎందుకీ మీకీ కలవరం’ అంటూ మన రచయితలు చూడచక్కని భావాలతో పాటలు కూడా రాశారు. ఇప్పుడు అలాంటి అనుకోని సంఘటనే ఐపీఎల్ లో చోటుచేసుకుంది. ఓ ప్రేమ చిగురించింది. టీమిండియా క్రికెటర్ ను ఓ ఇంటివాడిని చేయబోతోంది.

    చెన్నైసూపర్ కింగ్స్ ఆల్ రౌండర్, టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ మైదానంలో ఓ యువతిని చూసి ప్రేమలో పడ్డాడు. చుట్టూ కెమెరాలు ఉండగానే ఫ్యామిలీ గ్యాలరీలో ఉన్న ఓ అందమైన యువతి వద్దకు వెళ్లాడు. అనంతరం మోకాళ్లపై నిలబడి ఒక రింగ్ తీసుకొని ఆ యువతికి ‘ఐలవ్ యూ’ చెప్పాడు.

    టీమిండియా క్రికెటర్ తనకు ప్రపోజ్ చేయడంతో షాక్ అయిన యువతి కొద్దిసేపు ఆశ్చర్యపోయి అనంతరం అతడి ప్రేమకు ఓకే చెప్పింది. గట్టిగా హత్తుకొని ఓ ముద్దు ఇచ్చింది. అనంతరం దీపక్ చాహర్ రింగ్ తొడగగా.. యువతి కూడా అతడికి మరో రింగ్ తొడిగింది.

    ఇలా ఐపీఎల్ లో చెన్నై ముగింపు మ్యాచ్ సందర్భంగా ఈ అనుకోని సంఘటన ఎదురైంది. మైదానంలో జరిగిన ఈ ప్రేమ ప్రపోజల్ కు ధోని భార్య సాక్షి, కూతురు , సీఎస్ కే సీఈవోలు, ఇతర కుటుంబ సభ్యులు అక్కడే ఉండి ఈ కొత్త జంటను ఆశీర్వదించారు.