EMK: జెమినీ టీవీలో గత కొద్ది రోజుల నుంచి ప్రసారమవుతున్న షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది. ఎన్టీఆర్ హోస్టింగ్ తో తనదైన సత్తా చూపుతూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. కానీ ఈ షోలో ఇంతకీ ఏ ఒక్కరు కోటి రూపాయలు కూడా గెలుచుకోలేదు.

అక్టోబర్ 5న ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కి హైదరాబాద్ చెందిన ప్రత్యుషా వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సినిమా రివ్యూ రాస్తూ బ్లాగ్‌ను కూడా నడుపుతున్నారు. అయితే అద్భుతంగా, సమయస్పూర్తితో ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఎన్టీఆర్‌ను ఆకట్టుకొన్నారు. అయితే 50 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు తన గేమ్‌ను కొనసాగించింది.కానీ, దురదృష్టవశాత్తు 50 లక్షల రూపాయలకు సంబంధించిన సమాధానం తప్పు చెప్పి రూ. 3,20,000 లక్షల రూపాయలతో వెనుతిరిగింది.
అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఒక యువకుడు కోటి రూపాయల ప్రశ్నని టచ్ చెయ్యడమే కాకుండా కోటి రూపాయలు గెలుచుకుని కరోడ్ పతి అయ్యాడు. ఇటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ హోస్ట్ ఎన్టీఆర్, అటు షో నిర్వాహకులు అందరూ ఆశ్చర్యపోయారట. అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రారంభం కానుందట. ఈ షో మొదలయిన తర్వాత మొట్ట మొదటిసారిగా కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర లో నిలిచిపోయాడు. అయితే అతను ఎవరు, ఏంటి అని ఎవ్వరికి తెలియదు. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా ఆ అబ్బురపరిచే ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే..