
ఐపీఎల్ 2021 వేడుకకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ కు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. ఢిఫెడింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్ ను బెంగళూరుతో ఆడనుంది. ఈ క్రమంలోనే ముంబైకి భారీ ఊరట లభించింది.
ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్ కు ముందు నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షలలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి నెగెటివ్ గా రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టులలో వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరేతోపాటు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ముంబై ఇండియన్స్ లో ఆందోళన నెలకొంది. ఐపీఎల్ 14వ సీజన్ కు సన్నద్ధమవుతున్న టీంను ఇది కలవర పెట్టింది.
కిరణ్ మోరేతోపాటు హోటల్ లో ఉన్న ఆటగాళ్లు కూడా కంగారుపడ్డారు. అయితే ముంబై ఇండియన్స్ సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వారిని ఐసోలేషన్ లో ఉంచారు. క్వారంటైన్ కోసం కేటాయించిన ప్రత్యేక గదులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారందరికీ ఇప్పుడు నెగెటివ్ వచ్చింది.
తాజా పరిక్షల్లో ముంబై ఇండియన్స్ టీంతోపాటు సిబ్బంది కూడా నెగెటివ్ రావడంతో ఆ టీం ఊపిరి పీల్చుకుంది. బీసీసీఐ ప్రోటోకాల్స్ ప్రకారం అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ముంబై ఇండియన్స్ తెలిపింది.