IPL 18 Fever : కన్నడ జట్టు దాదాపు 18 సంవత్సరాల ఎదురుచూపు తర్వాత ఐపీఎల్ విజేత అయింది. ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న తర్వాత 18 నెంబర్ జెర్సీ ధరించిన విరాట్ కోహ్లీ మనసు మురిసిపోయింది. ఉద్వేగ భావంతో అతడు ఎత్తుకొని మై మరచిపోయాడు. 2+0+2+5 +6 + 3=18 ఈ సంవత్సరాన్ని, ఈ నెలను, చివరి అంచె పోటీ జరిగిన తేదీని కలుపుకుంటే 18 వస్తుంది. మొత్తంగా మూడు 18లు తమ జట్టుకు అనుకూలంగా నిలిచాయని.. తమ జట్టును చాంపియన్ ను చేశాయని కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరహా అద్భుతం ఐపీఎల్లో మరే జట్టుకు జరగదని పేర్కొంటున్నారు..” గ్రహాలు అనుకూలించాయి. తేదీలు అనుకూలించాయి. సంవత్సరం అనుకూలించింది. మైదానం అనుకూలించింది. చివరికి దేవుడు కరుణించాడు. మా ప్రార్థనలు ఫలించాయి. మా పూజలకు సార్ధకత లభించింది. మొత్తంగా మా జట్టు విజేత అయింది. గెలిచిన ప్రతి సందర్భంలో ఏ జట్టుకు కూడా ఇలాంటి ఘనత దక్కలేదు. మాకు చిరస్థాయిగా నిలిచిపోయే బహుమానం లభించింది. కన్నడ అభిమానులుగా గర్వపడుతున్నామని” ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఎన్ని హేళనలు.. ఎన్ని విమర్శలు.. అన్నింటిని తట్టుకొని విజేతగా..
ఐపీఎల్ లో విజయం కంటే ముందు కన్నడ అభిమానులు ఒక వీడియో రూపొందించారు. అందులో విరాట్ కోహ్లీని దేవుడిలాగా కీర్తించారు. అతడు ధరించిన జెర్సీకి పూజలు చేశారు. అతని పేరు మీద దేవాలయాలలో ప్రత్యేకంగా కార్యక్రమాలు జరిపారు. కచ్చితంగా తమ జట్టు గెలవాలని బలంగా కోరుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలతో ఏకంగా ఒక వీడియోను రూపొందించారు. ఆ వీడియోలో విరాట్ కోహ్లీని తమ వాడిగా పేర్కొన్నారు. కోహ్లీ పుట్టింది హస్తినలో అయినప్పటికీ.. కన్నడ అభిమానులు అతడిని తమ వాడిని చేసుకున్నారు. తమ గడ్డమీద పుట్టిన వ్యక్తిగా పేర్కొన్నారు. తమ జట్టు కోసం ఆడుతున్న శక్తిగా అభివర్ణించారు. ఆ వీడియోను సినిమా స్టైల్ మించి రూపొందించడంతో సోషల్ మీడియాలో వేలాది వీక్షణాలు సొంతం చేసుకుంది. కన్నడ జట్టు విజయం సాధించిన తర్వాత ట్విట్టర్లో ఆ వీడియో ట్రెండింగ్లో ఉండడం విశేషం. కన్నడ జట్టు విజయాన్ని ముందుగానే ఊహించిన అభిమానులు.. ప్రత్యేకంగా యాష్ టాగ్ ను ట్రెండ్ చేశారు. చివరికి అదే ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇప్పటికీ అది ట్విట్టర్లో ట్రెండింగ్లో కొనసాగుతోంది. వాస్తవానికి కన్నడ అభిమానులు తమ జట్టు గెలవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు . పూజలు చేస్తున్నారు.. ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ అనేక సందర్భాలలో కన్నడ జట్టు ఓటమిపాలై.. ట్రోఫీకి దూరమైంది. చివరికి ఇన్ని సంవత్సరాల తర్వాత విజేత అయింది. ఈ సందర్భాన్ని కన్నడ అభిమానులు గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మండు వేసవిలో దీపావళి పండుగను చేసుకుంటున్నారు. నిన్న రాత్రంతా బెంగళూరు నగరం బాణాసంచా వెలుగులతో కాంతివంతంగా మారింది.
The victory you know, The reason you don’t pic.twitter.com/8weM2FTTyc
— Sagar (@sagarcasm) June 3, 2025