Homeఆంధ్రప్రదేశ్‌AP Public Judgment Day : ప్రజా తీర్పుదినం.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంచలన కామెంట్స్!

AP Public Judgment Day : ప్రజా తీర్పుదినం.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంచలన కామెంట్స్!

AP Public Judgment Day : ఏపీలో ( Andhra Pradesh)కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తప్పలేదు. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే గత ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఏడాదిలోనే అద్భుత పాలన అందించామని టిడిపి కూటమి చెబుతోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజును వెన్నుపోటు దినముగా జరుపుకోగా.. కూటమి పార్టీలు మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గెలుపునకు కారకులైన మూడు పార్టీల కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మరింత స్ఫూర్తిదాయకమైన, మెరుగైన పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు.

Also Read : ఇక లడ్డూ కేసు.. టీటీడీ మాజీలపై గురి!

* నియంత పాలనకు తెర : సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజలతోపాటు కూటమి శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి అభినందనలు చెప్పారు.’ జూన్ 4.. # Praja teerpu dinam ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు.. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు.. సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడు స్వేచ్ఛ ప్రశాంతత పొందిన రోజు.. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు.. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు.. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు కమలనాధుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు’ అంటూ చంద్రబాబు పోస్ట్ పెట్టారు. టిడిపి శ్రేణులు విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

* చారిత్రాత్మక విజయం : పవన్ కళ్యాణ్
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) కూడా కూటమి గెలుపు పై ట్వీట్ చేశారు.’ ప్రజా తీర్పునకు ఏడాది.. ప్రజా చైతన్యానికి ఏడాది.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది.. ఎన్డీఏ కూటమి చారిత్రిక విజయానికి ఏడాది.. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేటు విజయానికి ఏడాది.. జూన్ 6, 2024 భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయిన రోజు.. ఐదేళ్ల అరాచక పాలనను తరిమికొట్టి… నిరంకుశ ఫ్యూడలిస్ట్ కోటలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టి.. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు.. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవభారత్ నిర్మాత, గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారి దృఢమైన నాయకత్వం… నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో.. దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి… మరెన్నో దాస్టీకాలను తట్టుకొని అడ్డగోలుగా నిలిచిన జనసైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలని జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు’ వన్ టూ త్రీ చేశారు పవన్ కళ్యాణ్.

* ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: లోకేష్
ఇంకోవైపు మంత్రి నారా లోకేష్( Lokesh) కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.’ ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంస పాలనపై ప్రజలు గెలిచారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజల ఆకాంక్షలు ఘనవిజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవం.. పవనన్న ఆశయానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభం అయింది. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని కోరుతున్నాను. ప్రజా తీర్పు దినం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular