Virat Kohli: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో లెజెండరీ క్రికెటర్లు ఎంతమంది ఉన్నా కూడా విరాట్ కోహ్లీ స్థానం వేరు అనే చెప్పాలి.ప్రస్తుతం ఆయన ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప ఆటగాడుగా గుర్తింపు పొందుతున్నాడు. ఎంతోమంది క్రికెటర్లు సైతం బ్రేక్ చేయలేని రికార్డులని బ్రేక్ చేస్తూ అలవోక గా కొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాడు.అలాంటి విరాట్ కోహ్లీ గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.
ప్రస్తుతం ఇండియా అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. అంటే అందులో విరాట్ కోహ్లీ పాత్ర చాలా కీలకమైందనే చెప్పాలి. ప్రస్తుతం కోహ్లీ సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న మూడో వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.ఇక ఇప్పటికే ఆయనకి సోషల్ మీడియాలో 340 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.ఒక వ్యక్తిని అంత మంది ఫాలో అవ్వడం అంటే మాములు విషయం కాదు నిజానికి విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో చాలా అగ్రేసీవ్ గా ఉంటూ ప్రతి ఒక్కరికి తన బ్యాట్ తోనే సమాధానం చెబుతూ ఉంటాడు.అందుకే కోహ్లీ ని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు.ఇక ఫ్యాన్స్ అతన్ని రన్ మిషన్ అని కూడా పిలుస్తారు. కోహ్లీ కి సెంచరీలు చేయడం మంచినీళ్లు తాగినంత ఈజీ అని చాలాసార్లు ప్రూవ్ చేశాడు. ఇలాంటి సందర్భంలో 2028 లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ లో క్రికెట్ ని భాగం చేయాలని అంతర్జాతీయ ఒలంపిక్స్ సంఘం నిర్ణయించడం జరిగింది. ఇక దాంతో 2028 లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలంపిక్స్ లో మనం క్రికెట్ ని చూడొచ్చు…
ఇక ఈ క్రమంలో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన నికోలో కాంప్రైనీ మాత్రం కోహ్లీ గురించి మాట్లాడుతూ నా మిత్రుడు అయిన కోహ్లీ 2028 లో ఒలంపిక్స్ లోకి అడుగు పెడుతున్నాడు అంటూ మాట్లాడుతూనే కోహ్లీ చాలా గొప్ప ప్లేయరు అంటూ చెబుతూ కోహ్లీ పైన ప్రశంశల జల్లు కురిపించాడు.ఇక ఇలాంటి సందర్భంలో ఆయన ప్రశంసల పైన మరికొందరు అభిమానులు స్పందిస్తూ 2028 లో ఒలంపిక్స్ లో క్రికెట్ ని చేర్చడం బాగానే ఉంది. కానీ ఇప్పటికే 34 సంవత్సరాల వయసు ఉన్న కోహ్లీ 2028 ఒలంపిక్స్ నాటికి టీం లో ఉంటాడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరికొందరు మాత్రం కోహ్లీ ఫిట్నెస్ చాలా బాగుంటుందని దాని ద్వారా ఆయన ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు ఈజీగా క్రికెట్ ఆడతారు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఈ క్రమంలో కోహ్లీ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో తెలిసిపోతుంది. నిన్నటికి నిన్న బాబర్ అజమ్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ కోహ్లీని గిఫ్ట్ గా జెర్సీ ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. అలాగే తను కోహ్లీ కి వీరాభిమానిని అని ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది… ఇలా కోహ్లీ పరుగులు చేస్తూ ఇండియన్ టీం పరువు నిలబెడుతూ ఆయన కూడా అత్యుత్తమ శిఖరాలని అధిరోహిస్తున్నాడు…