https://oktelugu.com/

Inzamam-ul-Haq: ఇండియా మీద పడి ఏడ్వడం కాదు.. ముందు నీ పాకిస్తాన్ దుకాణం చూసుకో

టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో సూపర్ -8 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు సమష్టి ప్రదర్శన చేసి, విజయాన్ని సొంతం చేసుకుంది. దర్జాగా సెమీస్ వెళ్ళిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 6:22 pm
Inzamam-ul-Haq

Inzamam-ul-Haq

Follow us on

Inzamam-ul-Haq: మన వీపు మనకు కనపడదు.. కానీ ఎదుటివారి వీపు స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో నరం లేని నాలుక ఎలాంటి విమర్శనైనా చేస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమాముల్ హక్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.. టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటలేక.. అమెరికా వంటి అనామక జట్టు చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును ఏమనలేక.. వరుస విజయాలతో సెమీస్ చేరిన భారత జట్టుపై పడ్డాడు.. వయసు పెరిగినా.. కనీస ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి అడ్డగోలుగా విమర్శలు చేశాడు. దీంతో ఈ పాక్ మాజీ కెప్టెన్ ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో సూపర్ -8 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు సమష్టి ప్రదర్శన చేసి, విజయాన్ని సొంతం చేసుకుంది. దర్జాగా సెమీస్ వెళ్ళిపోయింది. భారత జట్టు సెమీస్ వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ తలా తోకా లేని విమర్శలు చేశాడు. “16 ఓవర్లో కొత్త బంతిని అర్ష్ దీప్ సింగ్ ఎలా స్వింగ్ చేయగలిగాడు? బంతి 12 లేదా 13 ఓవర్లోనే రివర్స్ స్వింగ్ కు అనుకూలంగా మారిందా? అంపైర్లు కళ్ళు తెరిచి ఉండాలని” ఇంజమామ్ అన్నాడు..కాగా, ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 205 రన్స్ చేసింది. చేజింగ్ లో ఆస్ట్రేలియా 181 పరుగులకే పరిమితం అయిపోయింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 92 పరుగులు చేసి సత్తా చాటాడు.

ఇంజమామ్ చేసిన విమర్శలు నేపథ్యంలో.. టీమిండియా అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు..” ముందు నీ జట్టు సంగతి చూసుకో. వన్డే వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళింది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లోనూ అదే పరిస్థితి. కెప్టెన్లను మార్చారు. మీ దేశ ఆర్మీతో శిక్షణ ఇచ్చారు. చివరికి ఏం జరిగింది? టి20 వరల్డ్ కప్ కంటే ముందు ఐర్లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది.. అమెరికా చేతిలో పరాజయాన్ని మూటకట్టుకుంది.. కెనడా చేతిలో చావుతప్పి కన్ను లొట్ట పోయింది అన్న తీరుగా గెలిచింది. మీ జట్టు సంగతి చూసుకోక.. ట్యాంపరింగ్.. అంటూ ఏవేవో విమర్శలు చేస్తావా? అక్కడ అంపైర్లు ఉన్నారు. ఐసీసీ మ్యాచ్ రిఫరీలు ఉన్నారు. వారంతా ఉండగానే ట్యాంపరింగ్ జరిగిందని నీ అభిప్రాయమా? వయసు పెరుగుతున్నా కొద్దీ.. నీ బుర్రలో గుజ్జు తగ్గుతున్నట్టు ఉందని” భారత అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు..